England's Declan Rice Ready For Argentina Showdown:  ఫిఫా వరల్డ్ కప్ 2026 లో మోస్ట్ వైలెంట్ గా మారబోతున్న సెమీఫైనల్ సమరానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. అట్లాంటా వేదికగా బుధవారం జరగబోయే హై-వోల్టేజ్ నాకౌట్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అర్జెంటీనాతో ఢీకొనడానికి ఇంగ్లాండ్ టీమ్ ఫుల్ జోష్ తో రెడీ అయింది. ఈ బిగ్ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ థామస్ తుఖెల్ తమ టీమ్ కు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఇల్నెస్ తో సఫర్ అవుతున్న స్టార్ మిడ్‌ఫీల్డర్ డెక్లాన్ రైస్ ప్రెజెంట్ కంప్లీట్ గా రికవర్ అయి అర్జెంటీనాతో మ్యాచ్ లో ఫస్ట్ మినిట్ నుంచే ఆడటానికి పక్కా ఫిట్ గా ఉన్నాడని కన్ఫర్మ్ చేశాడు. సస్పెన్షన్ లో ఉన్న జారెల్ క్వాన్సా, ఇంజ్యూరీ అయిన జోర్డాన్ హెండర్సన్ తప్ప మిగతా ప్లేయర్లందరూ నెట్స్ లో ఫుల్ గా ప్రాక్టీస్ చేశారని కోచ్ చెప్పాడు. కో-హోస్ట్ మెక్సికోతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో హెండర్సన్ చెయ్యి విరగడం వల్ల అతను వరల్డ్ కప్ కు కంప్లీట్ గా దూరమయ్యాడు. నార్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో రైస్ హాఫ్ టైమ్ లోనే గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసినా, ఇప్పుడు మాత్రం ఫుల్ గా కోలుకున్నాడు.

Continues below advertisement

Continues below advertisement

ఇంగ్లాండ్ - ఆర్జెంటీనా  పాత పగలు.. ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఇంగ్లాండ్, అర్జెంటీనా జట్ల మధ్య ఉన్న రైవల్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కోచ్ థామస్ తుఖెల్ అన్నాడు. "ఇవి రెండు ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఫుట్‌బాల్ నేషన్స్. ఫుట్‌బాల్ ను లవ్ చేసే ప్రతీ ఒక్కరికీ ఈ రెండు జట్ల హిస్టరీ గురించి, గ్రౌండ్ లో జరిగే ఎమోషనల్ ఫైట్ గురించి పక్కాగా తెలుసు. ఈ మ్యాచ్ లో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి, మ్యాచ్ మోస్ట్ ఇంటెన్స్ గా సాగబోతోంది" అని తుఖెల్ చెప్పాడు. ఈ రెండు జట్ల మధ్య గతంలో 1986 లో మెక్సికో సిటీలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో డీగో మారడోనా కొట్టిన కాంట్రవర్షియల్ 'హ్యాండ్ ఆఫ్ గాడ్' గోల్, ఆ తర్వాత అతను సృష్టించిన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ గోల్ హిస్టరీలో నిలిచిపోయాయి. అలాగే 1998 లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో డేవిడ్ బెక్హాం రెడ్ కార్డ్ చూసి బయటకు వెళ్ళిన తర్వాత పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా విక్టరీ కొట్టిన చేదు జ్ఞాపకాలు ఇంగ్లాండ్ కు ఉన్నాయి.

Read Also: FIFA Expansion Plan: పుట్ బాల్ వరల్డ్ కప్ లో ఇండియా..  ఫిఫా చీఫ్ గియాని ఇన్ఫాంటినో కొత్త ఐడియా.. 2030లో ఛాన్స్..

పాత హిస్టరీని పట్టించుకోం.. విక్టరీ పైనే కంప్లీట్ ఫోకస్పాత హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ను ప్రెజెంట్ మ్యాచ్ కు ముందు ప‌ట్టించుకోమ‌ని తుఖెల్ క్లారిటీ ఇచ్చాడు. "మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మాకు బాగా తెలుసు, మా టార్గెట్ ఏంటనేది మా మైండ్ లో చాలా క్లియర్ గా ఉంది. వరల్డ్ కప్ ను రెండోసారి గెలవాలనేది మా క‌ల‌. ప్రెజెంట్ మేము సెమీఫైనల్స్ లో ఉన్నాం, కప్ గెలవాలనే ఆకలి మాలో విపరీతంగా ఉంది. నెక్స్ట్ విక్టరీ కొట్టడమే మా ప్లాన్. ప్రత్యర్థి టీమ్ ను మేము ఫుల్ గా రెస్పెక్ట్ చేస్తాం కానీ పాత హిస్టరీని తవ్వి మ్యాచ్ ను మరింత ప్రెజర్ లోకి నెట్టేయాలనుకోవడం లేదు" అని కోచ్ స్పష్టం చేశాడు.

ఆర్జెంటీనాకు కౌంటర్ ప్లాన్స్.. సెమీస్ సమరానికి కౌంట్‌డౌన్లియోనెల్ మెస్సి లీడర్‌షిప్ లోని అర్జెంటీనాను కట్టడి చేయడానికి ఇంగ్లాండ్ డిఫెన్స్ విభాగానికి తుఖెల్ సరికొత్త ప్లాన్స్ వేశాడు. మిడ్‌ఫీల్డ్ లో డెక్లాన్ రైస్ కంబ్యాక్ ఇవ్వడం వల్ల అర్జెంటీనా అటాకింగ్ గేమ్ ను ఈజీగా బ్రేక్ చేయవచ్చని, హ్యారీ కేన్ ఫామ్ ఇంగ్లాండ్ కు పెద్ద ప్లస్ పాయింట్ . ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ డైరెక్ట్ గా ఫైనల్స్ లో అడుగుపెడుతుందని, ఫ్యాన్స్ కు ఇదొక మైండ్ బ్లోయింగ్ ఫుట్‌బాల్ ఫీస్ట్ కాబోతుందని తుఖేల్ స్పష్టం చేశాడు. మ‌రోవైపు తాజాగా జ‌రిగిన సెమీస్ లో గ‌త ఎడిష‌న్ ర‌న్న‌ర‌ప్ ఫ్రాన్స్ ను 2-0తో ఓడించిన స్పెయిన్.. ఫైన‌ల్ కు అర్హ‌త సాధించింది.