Ravi Shastri: లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భాగంగా శుక్రవారం ఇండియా మహారాజాస్- వరల్డ్ జెయింట్స్ మధ్య సూపర్ బెనిఫిట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సూపర్ సబ్ స్టిట్యూట్ నిబంధన అమల్లోకి తీసుకొచ్చారు. ఇన్నింగ్స్ లో 10వ ఓవర్ అనంతరం ఈ సూపర్ సబ్ స్టిట్యూట్ ను ఇరు జట్లు వాడుకోవచ్చు. అయితే ఆట ప్రారంభానికి ముందే సూపర్ సబ్ స్టిట్యూట్ ఆటగాళ్ల పేర్లను ఇరు జట్లు వెల్లడించాల్సి ఉంటుంది.
ఎల్ ఎల్ సీ కమిషనర్ గా ఉన్న రవిశాస్త్రి ఈ నిబంధన గురించి మాట్లాడారు. ఇది గేమ్ ఛేంజర్ గా మారుతుందని అభిప్రాయపడ్డారు. క్రికెట్ ఏటా అభివృద్ధి చెందుతోందని రవిశాస్త్రి అన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచుల్లోనూ ఈ నిబంధన రావొచ్చని అన్నారు. టీ20 క్రికెట్ లో ఏదైనా సాధ్యమేనని ఆయన తెలిపారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ వంటి వాటిల్లో మన సొంత నియమాలు రూపొందించుకోవచ్చని అన్నారు. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటే ఈ సూపర్ సబ్ స్టిట్యూట్ నిబంధనను ప్రయత్నించవచ్చని సూచించారు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 పూర్తి షెడ్యూల్
శుక్రవారం, 16 సెప్టెంబర్- ప్రత్యేక మ్యాచ్: ఇండియా మహారాజాస్ vs వరల్డ్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
శనివారం, 17 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (రాత్రి 7:30; ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
ఆదివారం, 18 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (7:30 pm; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
సోమవారం, 19 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
బుధవారం, 21 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో)
గురువారం, 22 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
శనివారం, 24 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
ఆదివారం, 25 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (సాయంత్రం 4:00; అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ)
సోమవారం, 26 సెప్టెంబర్- మణిపాల్ టైగర్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
మంగళవారం, 27 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
గురువారం, 29 సెప్టెంబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బారాబతి క్రికెట్ స్టేడియం, కటక్)
శుక్రవారం, 30 సెప్టెంబర్- గుజరాత్ జెయింట్స్ vs భిల్వారా కింగ్స్ (రాత్రి 7:30 బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
శనివారం, 1 అక్టోబర్- ఇండియా క్యాపిటల్స్ vs మణిపాల్ టైగర్స్ (రాత్రి 7:30; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
ఆదివారం, 2 అక్టోబర్- క్వాలిఫైయర్ (ర్యాంక్ 1 vs ర్యాంక్ 2) (రాత్రి 4 గంటలకు; బర్కతుల్లా ఖాన్ స్టేడియం, జోధ్‌పూర్)
సోమవారం, 3 అక్టోబర్- ఎలిమినేటర్ (ర్యాంక్ 3 vs లూజర్ ఆఫ్ Q1) ( రాత్రి 7:30 , వేదిక ప్రకటించాల్సి ఉంది.)
బుధవారం, 5 అక్టోబర్- ఫైనల్ (క్వాలిఫైయర్ విజేత vs ఎలిమినేటర్ విజేత) (రాత్రి 7:30 వేదిక ప్రకటించాల్సి ఉంది.)