టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు పితృ వియోగం కలిగింది. అతడి తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం ఘాజియాబాద్‌లోని స్వగృహంలో మరణించారు. చాలా కాలంగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. తక్కువ జీతమే వస్తున్నా కొడుకు క్రికెటర్‌ను చేసేందుకు ఆయనెంతో కష్టపడ్డారు.
త్రిలోక్‌చంద్ రైనా సైనికాధికారి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో ఆయన దిట్ట. రైనా పూర్వీకులది జమ్ముకశ్మీర్‌లోని 'రైనావరి' గ్రామం. 1990ల్లో కశ్మీర్ పండితుల ఊచకోత తర్వాత త్రిలోక్‌చంద్ కశ్మీర్ నుంచి కుటుంబంతో సహా మురాదాబాద్ పట్టణానికి వచ్చేశారు. అక్కడ రూ.10వేల జీతానికి పనిచేసేవారు. సురేశ్ రైనా క్రికెట్ కోచింగ్‌కు సైతం డబ్బులు ఉండేవి కావు.
1998లో లక్నోలోని గురు గోవింద్ సింగ్ క్రీడా కళాశాలలో సురేశ్ రైనా చేరాడు. అక్కడ తనెంతో జాగ్రత్తగా ఉండేవాడినని రైనా గతంలో చెప్పాడు. కశ్మీర్‌లో జరిగిన దారుణాల గురించి, తమ కుటుంబం కశ్మీర్ నుంచి వచ్చిందని చెప్పేవాడిని కాదన్నాడు. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో కశ్మీర్‌లో క్రికెట్, క్రీడల అభివృద్ధికి సురేశ్ రైనా సాయం చేస్తున్నాడు.
Also Read: హమ్మయ్య ప్రపంచకప్ గెలిచేశాం! మేమిక ఐస్‌క్రీములు తినేస్తాం అంటున్న యశ్‌ధుల్
Also Read: లక్కంటే హిట్‌మ్యాన్‌దే! టీమ్‌ఇండియా 1000 వన్డేకు సారథ్యం! ఈ Stats చూస్తే ఆశ్చర్యమే!