Ind vs Sa 3rd T20I | భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ ఫ్లాప్ అయ్యాడు. సూర్యకుమార్ 12 పరుగులు చేసి లుంగి ఎంగిడి బౌలింగ్‌లో అవుటయ్యాడు. 2025 సంవత్సరం కెప్టెన్ సూర్యకు ఏమాత్రం కలిసి రాలేదు. ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 3 సార్లు డకౌట్ అయ్యాడు.

Continues below advertisement

2025లో సూర్యకుమార్ టీ20 ఇంటర్నేషనల్ రికార్డు

ఈ సంవత్సరంలో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్కోరు 47 పరుగులు. ఇది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్‌పై సాధించాడు. ఆ మ్యాచులో సూర్య నాటౌట్‌గా నిలిచాడు. ఇది కాకుండా, సూర్య ఏ మ్యాచ్‌లోనూ 40 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. సూర్య ఇంగ్లండ్‌పై 2 సార్లు, పాకిస్తాన్‌పై ఒకసారి ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ ఈ ఏడాది భారత్‌కు చివరి టీ20 సిరీస్. మొదటి మ్యాచ్‌లో సూర్య 12 పరుగులు చేసి అవుటయ్యాడు. రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆదివారం జరిగిన మూడో టీ20లో 12 పరుగులకు ఔటయ్యాడు. 

Continues below advertisement

2025లో టీ20లలో పేస్ బౌలింగ్‌లో సూర్యకుమార్ ఇన్నింగ్స్‌లు: 18పరుగులు: 122బంతులు: 106ఔటైనవి: 14సగటు: 8.71స్ట్రైక్ రేట్: 115.09డాట్ బాల్ శాతం: 50.9

T20I క్యాలెండర్ సంవత్సరంలో కెప్టెన్‌గా అత్యల్ప సగటు (నిమిషం 200 పరుగులు)12.52 - క్లింటన్ రుబాగుమ్య (రువాండా, 2022)14.20 - సూర్యకుమార్ యాదవ్ (IND, 2025)*15.56 - ఐడెన్ మార్క్రామ్ (SA, 2024)15.66 - క్లింటన్ రుబాగుమ్య (రువాండా, 2023)15.92 - యాసిమ్ ముర్తాజా (HKC, 2025)

శుభ్‌మన్ గిల్ కూడా బాగా ఆడలేదు 

టీ20 ఇంటర్నేషనల్‌లో 2025 సంవత్సరం టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఏమంత బాగా లేదు. ఈ ఏడాది 15 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 291 పరుగులు చేశాడు. ఈ ఏడాది గిల్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. గిల్ ఒకసారి డకౌట్ అయ్యాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి, రెండో మ్యాచ్‌లలో మొదటి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. మొదటి మ్యాచ్‌లో 4 పరుగులు చేసిన గిల్, రెండో మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. మూడో మ్యాచ్‌లో 28 బంతుల్లో 28 పరుగులు చేసినా స్లో ఇన్నింగ్స్ ఆడాడు.

ప్రపంచ కప్ గురించి ఆందోళన

వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. వరల్డ్ కప్ ముందు ప్రాక్టీస్ లాగ భావించే కీలకమైన టోర్నీల్లో స్టార్ బ్యాటర్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వరుసగా విఫలం కావడం జట్టుకు అంత మంచిది కాదు. వీరిద్దరూ ఫామ్‌లోకి రావాలి. దక్షిణాఫ్రికా తర్వాత, భారత్ తదుపరి టీ20 సిరీస్ వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరగనుంది. ఇది ప్రపంచ కప్‌కు ముందు భారత్‌ ఆడే చివరి టీ20 సిరీస్ అవుతుంది. సఫారీలతో సిరీస్ లోనూ మరో 2 టీ20 మ్యాచులున్నాయి. కనీసం వాటిలోనైనా గిల్, సూర్య కుమార్ గాడిన పడాలని భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్