ధర్మశాల: మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ పర్యాటక జట్టు దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా జట్టును 117 పరుగులకే ఆలౌట్ చేశారు. టార్గెట్ ఛేదించడానికి దిగిన భారత బ్యాట్స్‌మెన్‌ 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Continues below advertisement

118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడుతూ మంచి ప్రారంభం ఇచ్చారు. గిల్- అభిషేక్ కలిసి 5 ఓవర్లలో భారత్‌ను 60 పరుగులకు చేర్చారు. అభిషేక్ భారీ షాట్ ఆడబోయి ఎయిడెన్ మార్క్‌రమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అభిషేక్ 18 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి.

అభిషేక్ ఔటయ్యాక పరుగుల కోసం తిప్పలు..అభిషేక్ శర్మ ఔటయ్యే సమయానికి, 5.2 ఓవర్లలో భారత్ 60 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బ్యాటర్లు తాబేలు నడకలా నెమ్మదిగా పరుగులు చేశారు. మొదటి 5 ఓవర్లలో ఇండియా 12 రన్ రేట్‌తో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించగా, తర్వాతి 40 పరుగులు (60 నుంచి 100 పరుగుల వరకు) చేయడానికి భారత బ్యాట్స్‌మె 53 బంతులు ఆడారు.

నిలకడ చూపని గిల్, సూర్యటీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో 28 పరుగులు చేసినా, అందుకోసం 28 బంతులు తీసుకున్నారు. 18 ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత కూడా టీ20ల్లో శుభ్‌మన్ గిల్ అర్ధసెంచరీ కోసం ఎదురుచూపులు ముగియలేదు. లో స్కోరింగ్ మ్యాచులో వేగంగా పరుగులు చేయలేకపోయాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి 10 పరుగుల మార్కును దాటినా, ఈసారి కూడా సూర్య నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. భారత కెప్టెన్ సూర్య 12 పరుగులకే ఔటయ్యాడు.

బౌలింగ్‌లో భారత బౌలర్ల అద్భుతంధర్మశాలలో జరిగిన మూడో టీ20లో మొదట భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి దక్షిణాఫ్రికా జట్టును కేవలం 117 పరుగులకే పరిమితం చేశారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో బౌలర్‌గా హార్దిక్ పాండ్యా తన టీ20 కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. ఈ క్రమంలో పాండ్యా అరుదైన జాబితాలో చేరాడు. టీ20ల్లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన ప్రపంచంలో తొలి ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.

గతంలో ముగ్గురు స్పిన్నర్లు ఈ రికార్డు నమోదు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన షకీబ్, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజా, ఆఫ్టనిస్తాన్ కు చెందిన మహ్మద్ నబీలు బ్యాటింగ్ లో వెయ్యి పరుగులు, బౌలింగ్‌లో 100 వికెట్లు తీశారు. ఓవరాల్‌గా ఈ ఫీట్ నమోదు చేసిన నాలుగో ప్లేయర్ పాండ్యానే.