కొత్త సంవత్సరం రాబోతుంది. మరో క్రీడా సంవత్సరం కాల గర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో మధుర విజయాలు. కొన్ని విజయాలు అంతర్జాతీయ(International) క్రీడా వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. కొన్ని పరాజయాలు అభిమానులను కంటతడి పెట్టించాయి. భారత జట్టు(Indian Cricket Team) మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. వన్డే క్రికెట్(One Day Cricket)లో టీమిండియా బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దురదృష్టవశాత్తూ ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్(ICC ODI World Cup 2023 Final )లో ఓడిపోయింది. భారత క్రికెట్ జట్టుకు ఈ ఏడాదిలో అత్యంత చేదు జ్ఞాపకం ఇదే.
ఆ ఒక్క ఓటమి తప్పిస్తే భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది వన్డేల్లో అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కొత్త చరిత్ర లిఖించింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా వన్డేల్లో 27 విజయాలు సాధించింది. ఓవరాల్‌గా వన్డేల చరిత్రలో ఒకే ఏడాదిలో అత్యధిక విజయాలు సాధించిన రెండో టీమ్‌గా భారత్ నిలిచింది. అటువైపు బ్యాటర్లు రికార్డులు కొల్లగొడితే ఇటు బౌలర్లు కూడా వన్డే ఫార్మాట్‌లో మునుపెన్నడూ లేని విధంగా వికెట్ల పంట పండించారు. భారత బౌలర్లు ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో మొత్తం 289 వికెట్లు పడగొట్టారు. ఈ ఘనత సాధించడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. 1998లో 286 వికెట్లు తీసిన భారత్, 1999లో కూడా 283 వికెట్లు పడగొట్టింది. ఈ ఏడాది టీమిండియా పేసర్లు సరాసరి 27.4 బంతులకు ఒక వికెట్ తీశారు. భారత్ మినహా మరే ఇతర జట్టు ఈ ఘనత సాధించలేదు.
ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
కుల్దీప్ యాదవ్ - 30 మ్యాచుల్లో 49 వికెట్లు
మహ్మద్ సిరాజ్ - 25 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు
మహ్మద్ షమీ - 19 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు
ఎస్. లమిచానే - 21 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు
షాహిన్ షా అఫ్రీదీ - 21 మ్యాచ్‌ల్లో 42 వికెట్లు
హరీస్ రవూఫ్ - 22 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు
ఆడమ్ జంపా - 22 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు
మహేశ్ తీక్షణ - 22 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు
మార్కొ జాన్సెన్ 22 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు
షోరీపుల్ ఇస్లాం 22 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు
ఏడాది వన్డే క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన తొలి పది మంది ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లే ఉన్నారు. తొలి స్థానంలో గిల్(Subhman Fill) ఉండగా.. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ(Virat Kohli).. మూడో స్థానంలో రోహిత్ శర్మ(Rohit Sharma) ఉన్నాడు.
2023లో వన్డేల్లో టాప్ టెన్ రన్ స్కోర్లు
శుభ్‌మన్ గిల్- 1584 (29 మ్యాచ్‌లు)
విరాట్ కోహ్లీ- 1377 (27 మ్యాచ్‌లు)
రోహిత్ శర్మ- 1255 (27 మ్యాచ్‌లు)
డారిల్ మిచెల్- 1204 (26 మ్యాచ్‌లు)
పాతుమ్ నిస్సంక- 1151 (29 మ్యాచ్‌లు)
బాబర్ ఆజం- 1065 (25 మ్యాచ్‌లు)
మహ్మద్ రిజ్వాన్- 1023 (25 మ్యాచ్‌లు)
డేవిడ్ మలన్- 995 (18 మ్యాచ్‌లు)
ఐడెన్ మార్క్రామ్- 983 (21 మ్యాచ్‌లు)
కేఎల్ రాహుల్- 983 (24 మ్యాచ్‌లు).