Surya and Bhuvi in ​​2022 T20I: 2022 సంవత్సరం ముగిసింది. ఈ ఏడాదిలో భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్‌మెన్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ పేర్లు ఎవరో తెలుసా? భారత్ తరఫున స్టైలిష్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేయగా, వికెట్లు తీయడంలో భువనేశ్వర్ కుమార్ ముందు వరుసలో ఉన్నాడు.


టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 2022 సంవత్సరంలో 31 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 1164 పరుగులు చేశాడు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ సగటు 46.56 కాగా స్ట్రైక్ రేట్ 187.43గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది రెండు సెంచరీలతో పాటు తొమ్మిది సార్లు అర్థ సెంచరీలు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఏడాది వ్యవధిలో 1000 పరుగులు చేసిన మొదటి భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవే. ప్రపంచంలో ఈ రికార్డు సాధించిన రెండో బ్యాటర్ కూడా సూర్యనే.


బౌలింగ్‌లో భువీ
ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 32 మ్యాచ్‌లు ఆడిన భువీ 19.56 సగటుతో 37 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ తన బౌలింగ్‌లో తక్కువ పరుగులు ఇస్తూ ఉంటాడు. అదే బౌలింగ్ 2022లో కూడా కనిపించింది. 2022 సంవత్సరంలో T20 ఇంటర్నేషనల్‌లో కేవలం 6.98 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అదే సమయంలో 4 పరుగులకు 5 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా నమోదు చేశాడు.


2022లో టీమ్ ఇండియా ప్రదర్శన
ఈ ఇద్దరు ఆటగాళ్లు కాకుండా, 2022 సంవత్సరంలో మొత్తం టీమ్ ఇండియా ప్రదర్శనను పరిశీలిస్తే జట్టు ఈ సంవత్సరం మొత్తం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అందులో 4 మ్యాచ్‌లు గెలిచింది. ఇక వన్డే ఫార్మాట్ గురించి మాట్లాడితే 24 మ్యాచుల్లో 14 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. టీ20లో 40 మ్యాచ్‌లలో 28 సార్లు భారత జట్టు గెలిచింది.