RCB-W vs GG-W, Match Preview: ఆర్సీబీ.. పేపర్‌పై ఆడ పులులా! గుజరాత్‌ జెయింట్స్‌నైనా ఓడిస్తారా!

WPL 2023, RCB-W vs GG-W: విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరో మ్యాచులో గుజరాత్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. నేడు ఎవరో ఒకరు గెలుపు బాట పట్టక తప్పదు!

Continues below advertisement

WPL 2023, RCB-W vs GG-W:

Continues below advertisement

విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరో మ్యాచులో గుజరాత్‌ జెయింట్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. బ్రబౌర్న్‌ ఇందుకు వేదిక. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఈ రెండు జట్లు ఘోర పరాజయాలు చవిచూశాయి. నేడు ఎవరో ఒకరు గెలుపు బాట పట్టక తప్పదు! మరి స్మృతి, స్నేహ రాణాలో విజయం ఎవరిని వరించనుంది? తుది జట్లు ఏంటి? కీలక క్రికెటర్లు ఎవరు?

పేపర్‌ పులులేనా?

పేపర్‌ మీద చూస్తే భీకరమైన జట్టు! మైదానంలోకి దిగితే ఒక్కరంటే ఒక్కరూ నిలవడం లేదు. ఏ ఇద్దరూ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పడం లేదు. పురుషుల జట్టులాగే తయారైందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును (Royal Challengers Bangalore) అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. దాంతో నేడు స్మృతి మంధాన (Smriti Mandhana) జట్టు కచ్చితంగా గెలిచితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ ఆర్సీబీ విఫలమవుతోంది. స్మృతి మంధాన, ఎలిస్‌ పెర్రీ, రిచా ఘోష్‌ భారీ ఇన్నింగ్సులు బాకీ పడ్డారు. బహుశా సోఫీ డివైన్‌ స్థానంలో నేడు డేన్‌వాన్‌ నీకెర్క్‌ రావొచ్చు. ఆమె స్పిన్‌తో పాటు బ్యాటుతో సిక్సర్లు బాదగలదు. ముంబయిపై 15 బంతుల్లో 23 పరుగులు చేసిన శ్రేయాంక పాటిల్‌ ఆశలు రేపుతోంది. మేఘన్‌ షూట్‌, రేణుకా సింగ్‌, హీథర్‌ నైట్‌ బౌలింగ్‌లో రాణించాల్సి ఉంది.

అన్‌ లక్కీ గుజరాత్‌!

గుజరాత్‌ జెయింట్స్‌ది (Gujaraj Giants) విచిత్రమైన పరిస్థితి. తొలి మ్యాచులోనే కెప్టెన్‌ బెత్‌ మూనీ గాయపడింది. నేటి మ్యాచుకైనా అందుబాటులో ఉంటుందో లేదో తెలీదు. ప్రతిభావంతులు ఉన్నా గెలుపు దక్కడం లేదు. డియాండ్రా డాటిన్‌ ప్లేస్‌లో వచ్చిన కిమ్‌ గార్త్‌ (Kim Garth) బౌలింగ్‌లో రెచ్చిపోతోంది. మిగతా బౌలర్లు పరుగులు నియంత్రించడం లేదు. వికెట్లూ తీయడం లేదు. హేమలతా దయాలన్‌ (Hemalata Dayalan) మిడిలార్డర్లో కీలకంగా మారింది. ఓపెనర్లు సోఫీ డంక్లీ, మేఘనా రెడ్డి శుభారంభాలు ఇవ్వాల్సి ఉంది. హర్లీన్‌ డియోల్‌ ఫర్వాలేదు. యాష్లే గార్డ్‌నర్‌, సుష్మా వర్మ, సుథర్‌ల్యాండ్‌ బ్యాటింగ్‌లో మెరవాలి. ఇప్పటి వరకు ఈ జట్టులో హర్లీన్‌ మినహాయిస్తే ఒక్కరూ 30 స్కోరు చేయలేదు.  బౌలింగ్‌ బాగున్నా భాగస్వామ్యాలు విడగొట్టడం లేదు.

తుది జట్లు (అంచనా)

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్‌ /డేన్‌వాన్‌ నీకెర్క్‌, దిశా కసత్‌, ఎలిస్‌ పెర్రీ, హీథర్‌ నైట్‌, రిచా ఘోష్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్‌, మేఘన్‌ షూట్‌, రేణుకా సింగ్‌, ప్రీతి బోస్‌ / సహానా పవర్‌

గుజరాత్‌ జెయింట్స్‌: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్‌ డియోల్‌,  యాష్లే గార్డ్‌నర్‌, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్‌ సుథర్‌ల్యాండ్‌ / జార్జీవా వారెహమ్‌, స్నేహ్ రాణా, తనుజా కన్వార్‌, కిమ్‌ గార్త్‌, మాన్సీ జోషీ

Continues below advertisement