RCB vs GG:
విమెన్ ప్రీమియర్ లీగులో నేడు 16వ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. బ్రబౌర్న్ మైదానం వేదిక. ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ (RCB vs GG) తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. మరి తుది జట్లు ఎలా ఉండబోతున్నాయ్!
ఆర్సీబీకి ప్రాణ సంకటం!
ఐదు వరుస ఓటముల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (Royal Challengers Bangalore) తొలి విజయం లభించింది. దిల్లీని 150 కన్నా తక్కువ స్కోరుకు పరిమితం చేయడమే కాకుండా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. చాన్నాళ్లకు విన్నింగ్ కాంబినేషన్ సెట్ చేసుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఇంకా ఫామ్‌లోకి రాకపోవడం ఇబ్బంది పెడుతోంది. సోఫీ డివైన్ బ్లాస్టింగ్ ఓపెనింగ్స్ ఇస్తోంది. చివరి మ్యాచులో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి గుడ్ స్టార్ట్ ఇచ్చింది. యువ క్రికెటర్ కనిక అహుజా గెలుపు ఇన్నింగ్స్ ఆడటం విశేషం. ఎలిస్ పెర్రీ బంతి, బ్యాటుతో చెలరేగుతోంది. శ్రేయాంక పాటిల్ ఇంటెంట్ బాగుంది. రిచా ఘోష్, హీథర్ నైట్ ఫామ్‌లో ఉన్నారు. మేఘన్ షూట్ బౌలింగ్ ఫర్వాలేదు. రేణుకా సింగ్ వికెట్లు తీయాల్సి ఉంది.
గెలుపు తప్పనిసరి!
గుజరాత్ జెయింట్స్‌దీ (Gujarat Giants) బెంగళూరు పరిస్థితే! వరుసగా అన్ని మ్యాచులూ గెలిస్తే తప్ప ప్లేఆఫ్ ఛాన్స్ లేదు. యూపీ వారియర్స్‌తో పోటీ ఎదురవుతోంది. మ్యాచుల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా సానుకూలంగా ఉండటం జెయింట్స్ లక్షణం! చాలా మార్పులు చేశాక విన్నింగ్ కాంబినేషన్ కుదిరింది. మంచి బ్యాటర్లు ఉన్నా మిడిలార్డర్లో భాగస్వామ్యాలు నెలకొల్పడం లేదు. చివరి మ్యాచులో లారా వోల్‌వర్త్ హాఫ్ సెంచరీ చేసింది. సోఫీయా కొడితే స్కోరుబోర్డు పరుగెడుతుంది. హర్లీన్ డియోల్ (Harleen Deol) మంచి కేమియోలు ఆడుతోంది. యాష్లే గార్డ్‌నర్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. హేమలత, స్నేహ రాణా (Sneh Rana), సుష్మ వర్మ, కిమ్‌గార్త్ నుంచి పరుగులు ఆశిస్తున్నారు. బౌలింగ్ వరకు గుజరాత్ ఫర్వాలేదు.
తుది జట్లు (అంచనా)
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, లారా, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అశ్వనీ, స్నేహ రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మాన్సీ జోషీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేఘన్ షూట్, రేణుకా సింగ్, ఆశా శోభన, కనిక అహుజా