India vs new zealand Match Weather Report: వరల్డ్ కప్‌ 2023(World Cup 2023) టోర్నీ ఫైనల్‌ దశకు చేరుకుంది. ఆదివారం ఇండియా నెదర్లాండ్(India Vs Netherlands) మధ్య జరిగే నామమాత్రపు మ్యాచ్‌తో మొదటి దశ పోటీలు ముగుస్తాయి. టేబుల్ పట్టికలో టాప్‌లో ఉన్న నాలుగు జట్లు సెమీపైనల్స్‌లో పోటీ పడతాయి. ఇప్పటికే ఈ లిస్ట్‌లో ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెళ్లిపోయాయి. టెక్నికల్‌గా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరినప్పటికీ పాకిస్థాన్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌తో అది కూడా క్లియర్ కానుంది. 


ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో అన్నింట విజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో టాప్‌లో ఉంది. తన 9వ మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఇందులో గెలిచినా ఓడినా ఇండియా మాత్రం టాప్‌లోనే ఉంటుంది. రన్‌ రేట్ తగ్గతాయే తప్ప పాయింట్లలో ఎలాంటి మార్పు రాదు. 


తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. సఫారీలు 9 మ్యాచ్‌లలో ఏడింటిలో విజయం సాధించారు. 14 పాయింట్లతో వాళ్లు రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించినా ఆస్ట్రేలియా స్థానంలో మార్పు లేకపోవచ్చు. దక్షిణాఫ్రికా భారీ రన్ రేట్‌తో ఉంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే తప్ప ఆ రన్‌ రేట్‌ను దాటి వెళ్లడం ఆసిస్‌ జట్టుకు వీలుపడకపోవచ్చు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా ఆట చూస్తుంటే అలాంటి ఛాన్స్ లేనేలేదన్నది స్పష్టమవుతుంది. 


అందుకే మొదటి మూడు స్థానాలు ఇప్పుడు  ఉన్నవి ఉన్నట్టుగానే ఉంటాయే తప్ప ఎలాంటి మార్పు ఉండదు. ఆఖరి స్థానంలోకి న్యూజిలాండ్ వస్తుంది. ఇప్పుడు మొదటి సెమీఫైనల్‌ మొదటి స్థానంలో ఉన్న జట్టు నాల్గో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. అంటే లెక్క ప్రకారం టీమిండియా న్యూజిలాండ్ మరోసారి ఢీ కొట్టబోతున్నారు. నవంబర్‌ 15న ముంబైయిలోని వాంఖండే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 


రెండో సెమీఫైనల్‌ పాయింట్‌ టేబుల్‌లో రెండు మూడు స్థానాల్లో ఉన్న జట్లు పోటీ పడతాయి. ఒకవేళ బంగ్లాదేశ్‌పై భారీ విజయం నమోదు చేస్తే ఆస్ట్రేలియా రెండో స్థానానికి వెళ్తుంది. అప్పుడు దక్షిణాఫ్రికా మూడో స్థానానికి వస్తుంది. లేదంటే దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంటుంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంటుంది. ఏమైనా సరే రెండో సమీఫైనల్‌ ఈ సఫారీ, ఆసిస్ జట్ల మధ్య జరగనుంది. రెండో సెమిఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్‌ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరగనుంది. 


వర్షం పడితే పరిస్థితి ఏంటీ?


సెమీఫైనల్‌కు వర్షం బెడద లేకుండా షెడ్యూల్ చేశారు. రిజర్వర్ డేలు ఉంచారు. సెమీఫైనల్‌కు ఫైనల్ మ్యాచ్‌కు మధ్య మూడు రోజుల పాటు రిజర్వ్ డేలుగా ఉంచారు. ఒకరోజు వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోయిననా తర్వాత రోజు నిర్వహించనున్నారు. ఆ మూడు రోజులు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు అయితే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయి.


వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రిజర్వ్ డేలు అయిపోతే మాత్రం వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుంటారు. పాయింట్లు, రన్ రేట్ అన్నింటినీ పరిశీలించి ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఇప్పటి వరకు ఒక్క పరాజయం కూడా లేకుండా సెమీఫైనల్‌కు చేరడం టీమిండియాకు బాగా కలిసి వచ్చే అంశం. అందుకే ఒకే వేళ వర్షం పడి సెమీఫైనల్స్ రద్దు అయితే మాత్రం ఇండియా నేరుగా సెమీఫైనల్‌కు వెళ్తుంది. 


ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా విషయంలో మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఆస్ట్రేలియా చాలా వెనుకబడి ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఎంత అద్భుతం జరిగినా దక్షిణాఫ్రికా రన్‌రేట్‌ను దాటడం అంత ఈజీ కాదు. ఈ లెక్కన చూస్తే మాత్రం వర్షాలు పడి రెండో సెమీఫైనల్‌ మ్యాచ్ రద్దు అయితే మాత్రం కచ్చితంగా దక్షిణాప్రికా ఫైనల్ రేసులోకి వస్తుంది. అంటే వర్షాల కారణంగా రెండు సమీఫైనల్స్ రద్దు అయితే మాత్రం ఫైనల్ మ్యాచ్‌ను టీమిండియా దక్షిణాఫ్రికా ఆడే ఛాన్స్‌ ఉంది.