World Cup 2023 Points Table Update: 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి మూడో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఐదో స్థానానికి రావడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్ రేసులో మరింత పటిష్టంగా నిలిచింది. ఓడిపోయిన శ్రీలంక, పాకిస్తాన్‌లకు సెమీస్ దారి మరింత కష్టం అయింది.


ఈ విజయం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆరు పాయింట్లతోనూ, -0.718 నెట్ రన్‌రేట్‌తోనూ ఉంది. అదే సమయంలో శ్రీలంక, పాకిస్తాన్ చెరో నాలుగు పాయింట్లతో ఆరు, ఏడో స్థానాల్లో ఉన్నాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా శ్రీలంక పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ కంటే పైన ఉంది. అదే సమయంలో రెండు జట్లకు సెమీ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.


టాప్-4లో మార్పు లేదు
అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ విజయంతో పాయింట్ల పట్టికలోని టాప్-4 స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. ఆతిథ్య భారత జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికా 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఎనిమిదేసి పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది.


ఇదీ మిగతా జట్ల పరిస్థితి...
ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. దీని తర్వాత శ్రీలంక నాలుగు పాయింట్లు, -0.275 నెట్ రన్ రేట్‌తో ఆరో స్థానంలో, పాకిస్థాన్ నాలుగు పాయింట్లు, -0.387 నెట్ రన్ రేట్‌తో ఏడో స్థానంలోనూ, నెదర్లాండ్స్ నాలుగు పాయింట్లు, -1.277 నెట్ రన్‌రేట్‌తో ఎనిమిదో స్థానంలోనూ ఉన్నాయి.


ఆ తర్వాత బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌లు చెరో రెండు పాయింట్లతో తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్ ఇంగ్లండ్ కంటే కాస్త మెరుగ్గా ఉంది. దీని కారణంగా వారు ఇంగ్లండ్ కంటే ఒక స్థానం పైన ఉన్నారు. ప్రస్తుతం 2023 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్ -1.338గానూ, ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ నెగిటివ్ -1.652గానూ ఉంది. 










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial