World Cup 2023 Final Updates: స్విగ్గీలో 51 కొబ్బరికాయలు ఆర్డర్ చేసిన క్రికెట్ అభిమాని, ఇండియా గెలవాలని పూజలు

World Cup 2023 Final Match: టీమిండియా గెలవాలని ఓ స్విగ్గీ యూజర్ 51 కొబ్బరికాయలు ఆర్డర్ చేశాడు.

Continues below advertisement

World Cup 2023 Final Match Upadtes:

Continues below advertisement

51 కొబ్బరికాయలు ఆర్డర్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ (India Vs Australia Match) జరుగుతోంది. అందరూ టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోయారు. ఒక్క బాల్ కూడా మిస్‌ కాకుండా మ్యాచ్ చూస్తున్నారు. వరసగా 10 మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఫైనల్‌లోనూ గెలిచి కప్‌ (ICC World Cup) కొడుతుందని చాలా ధీమాగా ఉన్నారు ఇండియన్ క్రికెట్ అభిమానులు. కొందరైతే సెలబ్రేషన్స్ చేసుకోడానికి ముందుగానే అంతా రెడీ చేసుకున్నారు. ఓ వీరాభిమాని స్విగ్గీలో 51 కొబ్బరికాయలు ఆర్డర్ చేయడం వైరల్ (51 Coconuts in Swiggy) అవుతోంది. టీమిండియా గెలవగానే దేవుడికి 51 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు. థానేకి చెందిన ఓ క్రికెట్ అభిమాని 51 కొబ్బరికాయలు ఆర్డర్ చేశాడంటూ స్విగ్గీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేసిన ఆ యూజర్‌ ఆ కొబ్బరికాయల  ఫొటోని షేర్ చేశాడు. ఆర్డర్ చేసింది నేనే అంటూ పోస్ట్ పెట్టాడు. టీవీలో మ్యాచ్‌ పెట్టుకుని దాని ముందే కొబ్బరికాయలు పెట్టుకుని కూర్చున్నాడు.

అంతకు ముందు ఇదే యూజర్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కి 240 ధూప్‌ స్టిక్‌లు ఆర్డర్ చేశాడు. వాటిని వెలిగించి ఓ ప్లేట్‌లో పెట్టి వాటి ముందు కూర్చుని మరీ మ్యాచ్ చూశాడు. ఇండియా గెలవాలని ప్రార్థన చేశాడు. అనుకున్నట్టుగానే ఇండియా సెమీఫైనల్‌లో గెలిచి ఫైనల్‌ వరకూ వచ్చేసింది. అందుకే...ఈ సారి భారీగా ప్లాన్ చేశాడు. కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు. ఈ మ్యాచ్ కూడా గెలుస్తామని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు ఈ అభిమాని. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 

 

Continues below advertisement