Mitchell Marsh wishes Rishabh Pant was Australian: క్రికెట్‌(Cricket) ప్రపంచంలో  ఇప్పుడు ఎక్కడ చూసినా... రిషబ్ పంత్‌(Rishabh Pant) పేరే మార్మోగిపోతోంది. పంత్‌ను సూపర్‌ మ్యాన్‌తో ఒకరు పోలిస్తే... మరొకరు మిరాకిల్ మ్యాన్‌ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్‌.. ఆరంభ మ్యాచ్ లోనే అద్భుత శతకంతో.. టీమిండియా(Team India)కు ఘన విజయాన్ని అందించాడు. పంత్‌ సహా అశ్విన్‌, గిల్‌ విధ్వంసం... బౌలర్ల రాణింపుతో బంగ్లాను మట్టికరిపించిన టీమిండియా.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక కాన్పూర్‌ వేదికగా జరిగే రెండో టెస్టులోను భారత జట్టు పంజా విసిరితే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. ఇక భారత్ తర్వాత ఆస్ట్రేలియా(Australian)తో కఠిన పోరుకు సిద్ధం కానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఈ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ పంత్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారాయి.


Read Also: కాన్పూర్‌లో గత రికార్డులన్నీ మనవే , అత్యధిక పరుగులు చేసింద ఎవరంటే?


ఆసీస్ కెప్టెన్‌ ఏమన్నాడంటే..?
నవంబర్ 22న ఆరంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్‌ ఈ సిరీస్‌పై స్పందించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అధికారిక ప్రసార సంస్థ స్టార్ స్పోర్ట్స్‌తో ఇద్దరు ఆటగాళ్లు మాట్లాడారు. ఆస్ట్రేలియా జట్టులో కరెక్ట్‌గా సరిపోయే ఆటగాడిని ఇద్దరు ఆటగాళ్లు ఎంపిక చేశారు. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్... ఆస్ట్రేలియా జట్టులో సరిగ్గా సరిపోతాడని... మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అభిప్రాయపడ్డారు. " రిషబ్ పంత్ ఎలాంటి క్రికెటర్ అంటే.. అతను ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో బాగా సరిపోతాడు.” అని ఈ స్టార్ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.


Read Also: మహిళల టీ 20 ప్రపంచకప్‌లో అద్భుత పోరాటాలు చారిత్రక క్షణాలు


పంత్‌పై ప్రశంసల జల్లు
మిచెల్ మార్ష్ రిషబ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. రిషబ్ పంత్ అద్భుతమైన వ్యక్తి అని, అతను ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కొన్నేళ్లుగా పంత్ ఆటను చూసిన తర్వాత.. పంత్ పునరాగమనాన్ని ఘనంగా చాటిన వేళ ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాడు.  పంత్ వయసు పరంగా చిన్నవాడని.. కానీ అతను ఎప్పుడూ గెలవడానికి మాత్రమే ఇష్టపడతాడని తెలిపాడు. రిషబ్ పంత్ ఎప్పుడూ ఒత్తిడి లేకుండా ఉంటాడని, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడని కూడా ప్రశంసించాడు. తాను పంత్‌ను ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌గానే భావిస్తానని ట్రావిస్ హెడ్ అన్నాడు. తన దూకుడు స్వభావం,  వ్యూహంతో ఆడే విధానం బాగుంటుందని పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్... రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్  స్టైల్ చాలా ప్రత్యేకమైనదన్నాడు. అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టమని... అయితే, ఆస్ట్రేలియాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు నాథన్ లియాన్ సవాలు విసరగలడని భావిస్తున్నట్లు చెప్పాడు.