Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20లు, టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. పెరుగుతున్న ఊహాగానాల మధ్య, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ రాత్రి తమ తొలి IPL టైటిల్‌ను గెలిస్తే, కోహ్లీ IPL నుంచి రిటైర్మెంట్ గురించి కూడా ఆలోచించవచ్చని ప్రచారంలో ఉంది.
BBLలో కోహ్లీ ఉంటారని CA ఆశా భావంCA CEO టాడ్ గ్రీన్‌బర్గ్, వర్చువల్ మీడియా ఇంటరాక్షన్‌లో రాబోయే బిగ్ బాష్ లీగ్ (BBL) సీజన్‌లో కోహ్లీ పాల్గొనడాన్ని చూడాలనే తన కోరికను వ్యక్తం చేశారు. గతంలో, ఇంగ్లీష్ కౌంటీ జట్టు మిడిల్‌సెక్స్ కౌంటీ ఛాంపియన్‌షిప్ కోసం కోహ్లీని సంతకం చేయడానికి ఆసక్తి చూపిందని కూడా నివేదికలు వచ్చాయి.
“కచ్చితంగా BCCI తో చర్చించాం. నా ఉద్దేశ్యం, ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ BBLలో ఆడితే బాగంటుంది. అది కచ్చితంగా రేటింగ్‌లపై కొంత ప్రభావం చూపుతుంది. కానీ ప్రస్తుతానికి, అది జరగడం లేదు, కానీ ఆ దిశగా చర్యలు చేపట్టాలని మా లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్‌లు చాలా ప్రైవేట్ పెట్టుబడి అవకాశాలను తగ్గిస్తున్నాయి, ”అని గ్రీన్‌బర్గ్ CA ద్వారా జరిగిన వర్చువల్ మీడియా ఇంటరాక్షన్‌లో అన్నారు.
విదేశీ లీగ్‌ల్లో చురుకైన భారతీయ ఆటగాళ్లను అనుమతించడంపై BCCI తన వైఖరిని సవరించుకునే అవకాశం చాలా తక్కువ అయినప్పటికీ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై T20 మ్యాచ్‌లలో తిరిగి పాల్గొనడం - స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి స్టార్‌లతో వేదికను పంచుకోవడం చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుందని అభిమానులు అంటున్నారు.
BCCI వైఖరిలో ఎటువంటి మార్పు లేదు
“ఇటీవల ఇంగ్లాండ్‌లో ది హండ్రెడ్‌తో జరిగిన చర్చలు తెలిసిందే. అనేక IPL ఫ్రాంచైజీలు ఇప్పుడు ది హండ్రెడ్‌పై యాజమాన్య వాటాను తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో వ్యాపారాన్ని నడిపే విధానాన్ని మార్చాలి. కొత్త ఆవిష్కరనలను కొనసాగించాలి. ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి. కానీ ఆ ప్రశ్నకు సంక్షిప్త సమాధానం ఏమిటంటే, రిటైర్డ్, ఇటీవల రిటైర్డ్ లేదా ప్రస్తుత భారత క్రికెటర్లకు BBLలో ఆడటానికి అవకాశాలు ఇస్తే చాలా మంది వస్తారు. ఇక్కడ వాళ్లకు ఘన స్వాగతం లభిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన చర్చలు ఇంతే,” అని గ్రీన్‌బర్గ్ చెప్పుకొచ్చారు.
రూల్స్ కారణంగా ఆడని ఇండియన్ క్రికెటర్లు
బిగ్‌బాష్ లీగ్ అనేది ఆస్ట్రేలియాలో నిర్వహించే ప్రము టీ 20 క్రికెట్ లీగ్. 2011లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ క్రికెటర్లు ఎవరూ ఇక్కడ ఆడలేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్‌లో ఉన్న వారు, లేదా ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఆడినవారు ఈ లీగ్‌లలో పాల్గొనడానికి అనుమతి లేదు. ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్లు కూడా బీబీఎల్‌లో ఆడలేదు.
బీబీఎల్ ఆడిన మహిళా క్రికెటర్లు
మహిళా బిగ్ బాష్ లీగ్‌లో భారతీయ మహిలా క్రికెటర్లు పాల్గొన్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రోగ్స్, షఫాలీ వర్మ, రాధా యాదవ్ పాల్గొన్నారు.