Ajit Agarkar Press conference | ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత్ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్ భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత గిల్‌కు సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీని అప్పగించారు. ఇప్పుడు రోహిత్ శర్మ వన్డే జట్టులో ఉన్నప్పటికీ శుభ్‌మన్ గిల్‌కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. దాంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడటంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

రోహిత్, విరాట్ వన్డే ప్రపంచ కప్ ఆడతారా?

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు ఇండియా జట్టును ప్రకటించిన తర్వాత చీఫ్ సెలెక్టర్, భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్‌ను ఓ ప్రశ్న ఎదురైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతారా అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ ను అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం ప్రస్తుతం దీని గురించి ఏమీ రివీల్ చేయకూడదు అనుకుంటున్నారు' అని తెలివిగా సమాధానం చెప్పారు. కొన్ని రోజుల కిందట బీసీసీఐ మాత్రం రోహిత్, కోహ్లీ లాంటి ఆటగాళ్లు వన్డే ప్రపంచ కప్‌లో కీలకం అవుతారని చెప్పింది. అంటే వారు ఆడే అవకాశం ఉందని పరోక్షంగా చెప్పింది. కానీ తాజాగా అగార్కర్ మాటలు చూస్తే.. వచ్చే వన్డే ప్రపంచ కప్ నాటికి రోకో ధ్వయం ఫిట్ గా ఉండటం ముఖ్యం, ఫాంలోనూ ఉండాలి.  ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ సైతం వారి కెరీర్ ను డిసైడ్ చేస్తుందని కొన్ని రోజుల కిందట బీసీసీఐ నుంచి సమాచారం వచ్చింది.

విరాట్, రోహిత్ రిటైర్మెంట్ పై చర్చ

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత పొట్ట ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అదే సమయంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు ముందు మే 7న రోహిత్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐదు రోజుల తర్వాత మే 12న విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. దాంతో వారు ఆడే ఫార్మాట్ వన్డేలు మాత్రమే. ఆ కారణంతోనే ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నీలో వీరిద్దరూ ఆడలేకపోయారు.

Continues below advertisement

వచ్చే వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడానికి.. జట్టులో యువరక్తాన్ని చేర్చుతున్నారు. అదే సమయంలో రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాలు జట్టులో ఉంటేనే ప్రయోజనం అని గట్టిగా వినిపిస్తోంది. బీసీసీఐ ఏం చేస్తుంది, వన్డే సిరీస్ లలో వీరు చేసే ప్రదర్శన, ఫిట్ నెస్ పైనే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలిసిందే.