Shubman Gill : భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త శకం ఆరంభం కానుంది. ఇప్పటి వరకు వన్డే జట్టు కెప్టెన్గా బాధ్యత వహిస్తూ వస్తూ ఎన్నో విజయాలు సాధించిన రోహిత్ స్థానంలో కొత్త సారథి వచ్చేశాడు. ఇప్పటికే టెస్టు బాధ్యతలు నిర్వహిస్తున్న శుభ్మన్ గిల్‌కు వన్డే బాధ్యతలు కూడా బీసీసీ అప్పగించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా వెళ్లే టీంకు ఆయన్నే కెప్టెన్గా ప్రకటిస్తూ జట్టును ఎంపిక చేసింది. అవిశ్రాంతంగా క్రికెట్ ఆడుతున్న శుభ్మన్ గిల్‌కు విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రోహిత్ స్థానంలో శుభ్మన్ గిల్ను కెప్టెన్ చెబుతూ జట్టును ప్రకటించారు.
మెన్ ఇన్ బ్లూ జట్టు అక్టోబర్ 19, 2025 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆస్ట్రేలియాలో ఆడనుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరుగుతుంది. 2027 వన్డే ప్రపంచ కప్‌నకు రోహిత్ శర్మ ఆడేది అనుమానంగా ఉంది. అందుకే ఇప్పటి నుంచి యువ రక్తంతో జట్టును పరుగులు పెట్టించాలని యాజమాన్యం భావిస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో 2027లో ఐసిసి ప్రపంచ కప్ జరగనుంది. అప్పటికి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత్ వన్డే జట్టును బలోపేతం చేయనున్నారు. దీనికి ఆస్ట్రేలియా టూర్తోనే శుభారంభం చేస్తున్నారు. ఇప్పటికే టెస్టు జట్టు కెప్టెన్గా గిల్ మంచి విజయాలు సాధిస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో రోహిత్ శర్మ టెస్ట్, టీ 20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ (ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ)కి ముందు, గిల్‌ను వైట్స్ లో కెప్టెన్‌గా నియమించారు.ఈ సిరీస్ను జట్టు 2-2తో డ్రాగా ముగించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ను కూడా అతను ఇన్నింగ్స్ మరియు 140 పరుగుల తేడాతో గెలుచుకున్నాడు.
2024లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ విరాట్ కోహ్లీతో కలిసి రిటైర్ అయిన టీ20లలో, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు, కానీ ఆసియా కప్‌కు ముందు గిల్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2027 ఐసీసీ వరల్డ్ కప్ (వన్డే) ప్రారంభమయ్యే సమయానికి, రోహిత్ శర్మ వయస్సు 40 సంవత్సరాలు అవుతుంది, కాబట్టి సెలక్షన్ కమిటీ అతనిపై భారాన్ని తగ్గించుకోవాలని, అలాగే ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ప్రారంభానికి చాలా ముందే కొత్త కెప్టెన్‌తో భారత క్రికెట్ తదుపరి తరానికి అప్పగించాలని ప్లాన్ చేసింది.
ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే జట్టు ఇదే
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వీ జైస్వాల్