KN Prudhviraj Responds After Hanuma Vihari Accuses Him: భవిష్యత్తులో తాను ఆంధ్ర క్రికెట్ జట్టు(Andhra Cricket Team) తరఫున ఆడబోనని సీనియర్ బ్యాటర్ హనుమ విహారి(Hanuma Vihari) తేల్చి చెప్పారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్(Instgram)లో పోస్టు చేశారు. ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారడంతో ఈ విషయంపై ఇన్‌స్టాలోనే పృథ్వీ రాజ్ అనే మరో క్రికెటర్ కౌంటర్ పెట్టాడు.
‘మీరు ఆ కామెంట్ బాక్స్‌లో వెతుకుతున్న ఆ ప్లేయర్ ను నేనే. మీరు విన్నదంతా అబద్దం. గేమ్ కంటే ఎవరూ పెద్దవారు కాదు. ఆట నా ఆత్మగౌరవం కంటే పెద్దదేమీ లేదు. వ్యక్తిగత దాడులు, నిందాపూర్వక భాష అది ఇక్కడే కాదు ఏ వేదికమీదనైనా అంగీకారయోగ్యం కాదు. ఆ రోజు ఏం జరిగిందో జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసు. నువ్వు ఇంతకు మించి ఏమీ పీకలేవు మిస్టర్ సో కాల్డ్ చాంపియన్’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు ‘ఒక వేళ నీవు కావాలనుకుంటే ఈ సింపథీ గేమ్ ఆడుకో’ అని రాశాడు. ఇంతకీ పృధ్వీరాజ్ ఎవరంటే.. తను ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయలేదు.
అసలేం జరిగిందంటే ..
భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ జట్టు తరఫున ఆడబోనని సీనియర్ బ్యాటర్ హనుమ విహారి తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్‌తో క్వార్టర్ ఫైనల్‌లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం విహారి ఈ నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్ నుంచి తప్పించినా జట్టు పట్ల, ఆట పట్ల ప్రేమతో ఇన్నాళ్లు ఆటను కొనసాగించానని పేర్కొన్నారు. ఇకపై ఆంధ్ర తరఫున ఆడబోనని తేల్చిచెప్పారు. రంజీ మ్యాచ్‌లో భాగంగా బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 17వ ఆటగాడిపై అరిచానని తెలిపారు. ఆ ఆటగాడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి చెప్పడంతో ఆయన తనపైనా చర్యలు తీసుకోవాలని ACAపై ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. తన వైపున తప్పు లేకపోయినా కెప్టెన్ నుంచి తప్పించారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా సదరు ఆటగాడిని తాను ఏమి అనలేదని వివరించారు. గతేడాది మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుడి చేతికి గాయమైనా జట్టు కోసం ఎడమ చేతితోనే బ్యాటింగ్ చేశానని గుర్తు చేశారు. అంతే కాదు ఈ విషయం తనతో పాటూ ఉన్న ప్లేయర్ అందరికీ తెలుసు అంటూ వారి సంతకాలు ఉన్న పేపర్ కూడా పోస్ట్ చేశాడు.