W Sundar Misses Lanka Series: ఇండియన్ క్రికెట్ టీమ్ లో ప్లేయర్ల ఇంజ్యూరీ సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఆల్రెడీ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నుంచి కంప్లీట్ గా రూల్ అవుట్ అయ్యారు. ఈ టైమ్ లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రూపంలో టీమ్ కి మరో బ్యాడ్ న్యూస్ అందింది. గతేడాది ఇంగ్లాండ్ వైట్ బాల్ టూర్ లో కాలికి తగిలిన గాయం నుంచి కోలుకోకపోవడంతో ఫస్ట్ టెస్ట్ నుంచి తప్పుకున్న సుందర్, కొలంబోలో జరగబోయే సెకండ్ టెస్ట్ మ్యాచ్ కి కూడా దూరమయ్యే ఛాన్స్ ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
సీఓఈ మెడికల్ టీమ్ జాగ్రత్తలు.. రిస్క్ తీసుకోవడానికి బిసిసిఐ నోఇండియా, శ్రీలంక మధ్య ఫస్ట్ టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా జరగనుండగా, సెకండ్ టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో (SSC) లో జరగనుంది. ఇప్పటికే చాలా మంది కీ ప్లేయర్లు గాయాలపాలవ్వడంతో బెంగళూరులోని సీఓఈ (CoE) మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్ సుందర్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. హామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్న సుందర్ సెకండ్ టెస్ట్ నాటికి శ్రీలంక వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని తాజా రిపోర్ట్ వెల్లడించింది. నెక్స్ట్ వీక్ అతడికి ఫుల్ మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు.
సాయి సుదర్శన్ ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్.. బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీకాలి బొటనవేలి గాయంతో లంక టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న సాయి సుదర్శన్ బెంగళూరు సీఓఈ లో రికవరీ అవుతున్నాడు. సుదర్శన్ ప్లేస్ లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ను సెలెక్టర్లు టీమ్ లోకి తీసుకున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లో లెఫ్ట్ నీ ఇంజ్యూరీ వల్ల ఇబ్బంది పడుతున్న జస్ప్రీత్ బుమ్రా కూడా సిరీస్ నుంచి అవుట్ అయ్యాడు. బిసిసిఐ మెన్స్ సెలెక్షన్ కమిటీ బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీని స్క్వాడ్ లోకి అనౌన్స్ చేసింది.
వార్మప్ మ్యాచ్ లో పడిక్కల్ మైండ్ బ్లాకింగ్ సెంచరీ.. 6 వికెట్లతో ఇండియా విన్టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్స్ లో భాగంగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్ తో జరిగిన త్రీ-డే వార్మప్ మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దేవదత్ పడిక్కల్ నాటౌట్ గా 142 రన్స్ కొట్టి మెప్పించగా, బౌలర్లు కూడా కలసికట్టుగా రాణించి టీమ్ కి బిగ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ గెలుపుతో ఇండియన్ టీమ్ గాలే టెస్ట్ కోసం ఫుల్ జోష్ తో రెడీ అవుతోంది.
