Top Batsman Scored 13000 Runs in ODI Cricket: వన్డే ఇంటర్నేషనల్ చరిత్రలో 13,000 పరుగుల మైలురాయిని దాటడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా గొప్ప విజయం. భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకుని చరిత్ర సృష్టించాడు. కోహ్లీ వన్డే క్రికెట్‌లో 13,000 పరుగులు చేసిన ప్రపంచంలో ఐదో ఆటగాడు. రెండో భారతీయుడు. అతనితోపాటు, నలుగురు దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. విరాట్ కోహ్లీ నుంచి కుమార సంగక్కర వరకు, అత్యంత వేగంగా 13,000 వన్డే పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం?
వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లు
1. విరాట్ కోహ్లీ (భారత్) - 267 ఇన్నింగ్స్‌లు
భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ 278 వన్డే మ్యాచ్‌లలో 267 ఇన్నింగ్స్‌లలో 13,000 పరుగులు పూర్తి చేశాడు.
2. సచిన్ టెండూల్కర్ (భారత్) - 321 ఇన్నింగ్స్‌లు
వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో భారత గొప్ప బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 330 వన్డే మ్యాచ్‌లలో 321 ఇన్నింగ్స్‌లలో 13,000 పరుగులు పూర్తి చేశాడు.
3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 341 ఇన్నింగ్స్‌లు
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ 350 వన్డే మ్యాచ్‌లలో 341 ఇన్నింగ్స్‌లలో 13,000 పరుగులు పూర్తి చేశాడు.
4. కుమార సంగక్కర (శ్రీలంక) - 363 ఇన్నింగ్స్‌లు
వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర నాల్గో స్థానంలో ఉన్నాడు. సంగక్కర 386 వన్డే మ్యాచ్‌ల్లో 363 ఇన్నింగ్స్‌ల్లో 13,000 పరుగులు పూర్తి చేశాడు.
5. సనత్ జయసూర్య (శ్రీలంక) - 416 ఇన్నింగ్స్‌లు
శ్రీలంక మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య వన్డే ఇంటర్నేషనల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. జయసూర్య 428 వన్డే మ్యాచ్‌ల్లో 416 ఇన్నింగ్స్‌ల్లో 13,000 పరుగులు పూర్తి చేశాడు.