టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి రావాలని కోరుకుంటూ బాబర్ ఆజమ్ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 16 పరుగులకే అవుట్ కావడంపై బాబర్ ఆజమ్ ట్వీట్ ద్వారా స్పందించాడు. ఈ మ్యాచ్ తర్వాత విరాట్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి.
గత కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ ఫాం బాగోకపోవడంతో తనను జట్టు నుంచి తప్పించాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. బాబర్ ఆజమ్ తన ట్వీట్‌లో ‘This too shall pass. Stay strong. #ViratKohli’ అని పేర్కొన్నాడు. ‘ఈ గడ్డుకాలం కూడా గడిచిపోతుంది. దృఢంగా ఉండు.’ అని ఈ ట్వీట్ అర్థం.
దీనిపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ ‘Thank you. Keep shining and rising. Wish you all the best.’ ‘ధన్యవాదాలు. ప్రకాశిస్తూనే ఉండు. ఆల్ ది బెస్ట్.’ అని విరాట్ కోహ్లీ ఇచ్చిన రిప్లైకి అర్థం. ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతుంది.
పాకిస్తాన్, శ్రీలంక టెస్టు మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్పరెన్స్‌లో కూడా బాబర్ ఆజమ్... విరాట్ కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. ‘ఒక ఆటగాడిగా, ఆ దశలోకి నేను కూడా వెళ్తానని నాకు తెలుసు. ఆ దశలో ఎలా ఆటగాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఆ సమయంలో వారికి సపోర్ట్ కావాలి. తనకు కొంత సపోర్ట్ ఇవ్వాలని ట్వీట్ చేశాను. తను అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు.’ అని ఆ ప్రెస్ కాన్పరెన్స్‌లో తెలిపాడు.
‘తను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటకు రావాలో కూడా తనకు తెలుసు. దానికి సమయం పడుతుంది. ఆటగాళ్లకు మద్దతు ఇస్తే, అది చాలా బాగుంటుంది’ అన్నాడు.