Tejashwi Yadav Claims Virat Kohli Played Under His Captaincy: బీహార్( Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (LAlu Prasad Yadav) కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav)  చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన క్రికెట్ ప్రయాణంపై తేజస్వీ యాదవ్ పలు ఆశ్యర్యకరమైన విషయాలు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఆడాదని,  తన సారధ్యంలో ఆడిన వారిలో చాలా మంది భారత స్టార్ ఆటగాళ్లు గా ఉన్నారని  అని తేజస్వి యాదవ్ తెలిపారు.

 

విరాట్ కూడా నా కెప్టెన్సీలోనే..

రాజకీయ నేతగా తేజస్వీ యాదవ్ చురుగ్గా ఉంటాడు. అయితే తేజస్వీ రాజకీయ నేతే కాకుండా దేశవాళీ క్రికెట్లో కూడా రాణించాడు. తాజగా తేజస్వీ తన క్రికెట్ ప్రయాణాన్ని పంచుకోవడంతో ఆ అంశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశీయ క్రికెట్‌లో భారత క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఆడాడని  తేజస్వీ గుర్తు చేశాడు. దేశవాళీ క్రికెట్ లో స్టార్ ప్లేయర్‌గా ఉన్న తాను ఇప్పుడు క్రికెట్ కెరీర్ ను వీడినందుకు సంతోషంగా లేనని తేజస్వి తెలిపాడు. "నేను క్రికెటర్‌ని. దాని గురించి ఎవరూ మాట్లాడరు. విరాట్ కోహ్లి నా కెప్టెన్సీలో ఆడాడు. ఎవరైనా దాని గురించి మాట్లాడారా? ఎందుకు అలా చేయరు? ప్రొఫెషనల్‌గా నేను మంచి క్రికెట్ ఆడాను. చాలా మంది టీం ఇండియా ఆటగాళ్లు నా బ్యాచ్‌మేట్స్. నా రెండు లిగమెంట్లు ఫ్రాక్చర్ అయినందున నేను క్రికెట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది." అని తేజస్వీ తెలిపాడు. 





 

సోషల్ మీడియాలో వైరల్

తేజశ్వి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, క్రికెట్ అభిమానుల ఈ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందిస్తున్నారు. తేజస్వి తన కెరీర్‌లో మొత్తం 1 ఫస్ట్ క్లాస్, 2 లిస్ట్ A, 4 T20 మ్యాచ్‌లు ఆడాడు.37 పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు.దేశవాళీ టోర్నమెంట్ లలో తేజస్వీ జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు, నవంబర్ 2009లో విదర్భపై ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. రెండు లిస్ట్ A మ్యాచులను.. ఫిబ్రవరి 2010లో త్రిపుర, ఒరిస్సాలపై ఆడాడు. నాలుగు T20 మ్యాచ్‌లు ఒరిస్సా, అస్సాం, బెంగాల్, త్రిపుర జట్లపై ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 సీజన్‌లో తేజస్విని ఢిల్లీ డేర్‌డెవిల్స్  కొనుగోలు చేసింది. అయితే ఈ విషయం చాలామందికి తెలీదు. 2008 నుంచి 2012 వరకు తేజస్వీ  ఢిల్లీ జట్టుతోనే ఉన్నా ఆడే అవకాశమైతే రాలేదు.

 


 

బంగ్లా టెస్టుకు కోహ్లీ సిద్ధం

శ్రీలంక వన్డే పర్యటనలో భారత్ తరపున ఆడిన కోహ్లీ బంగ్లా టెస్టుకు సిద్ధమయ్యాడు. వచ్చే వారం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం చెన్నైలో ఉన కోహ్లీ బంగ్లాతో సిరీస్ కోసం చెమట చిందిస్తున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న టీమిండియా.. బంగ్లాదేశ్‌పై వైట్‌వాష్‌తో పాయింట్లు మరింత పెంచుకోవాలని చూస్తోంది.