దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ మ్యాచ్ ప్రారంభమైంది. పాతికేళ్ల తర్వాత ఈ టోర్నీలో న్యూజిలాండ్ భారత్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ ప్లేయింగ్ 11లో చోటు సంపాధించుకోవడంతో రన్ మెషిన్ విరాట్ కొహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఒక ప్రత్యేక రికార్డు సొంతం చేసుకుంటున్నాడు. 

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడటంతో భారత్ తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతను భారత్‌ తరఫున 550 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున 549 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఇప్పుడు ఈ మ్యాచ్‌తో ఆ సంఖ్య 550కి చేరుకుంది. 

Read Also: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం

టీం ఇండియా తరపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ మొత్తం టీమిండియా తరఫున 664 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత స్థానం కోహ్లీదే.కోహ్లీ భారతదేశం తరపున వన్డేలు, టీ20లు, టెస్టులతో సహా 549 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 27598 పరుగులు చేశాడు. ఇందులో కోహ్లీ 82 సెంచరీలు చేశాడు. అత్యధిక సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

Read Also: Virat Kohli Injury: ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్