Virat Kohli Century | Sachin Tendulkar 100 Centuries:
2016, 17 నాటి వైబ్స్ వస్తున్నాయా...
ఒక్కసారి కింగ్ ఫాంలోకి వస్తే ఏ రికార్డులూ మిగలవిక్కడ. నిన్న శ్రీలంకపై మూడో వన్డేలో 74వ అంతర్జాతీయ శతకం సాధించిన దగ్గర నుంచి విరాట్ కోహ్లీ వీర ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎక్స్ ప్రెస్ చేస్తున్న ఆనందం సారాంశం ఈ డైలాగ్. ఎస్.... నిజమే మన కింగ్ కోహ్లీ అంతటి ఫాంలోకి వచ్చేశాడు. రక్తం రుచి మరిగిన సింహంలా వేటాడుతున్నాడు. లేకపోతే గత నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలు ఏంటి చెప్పండి.. ఏంటండీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ 2016, 17 నాటి వైబ్స్ వస్తున్నాయా... రానివ్వండి అంటున్నారు. ఎంత ఎక్కువ వస్తే మనకు అంత మంచిది. అసలే మరికొన్ని నెలల్లో వన్డే వరల్డ్ కప్ ఉందిగా. విరాట్ 2016 కన్నా బెస్ట్ ఇయర్ గా ఈ ఏడాదిని మార్చుకోవాలని కోరుకుందాం.
సరే విరాట్ ప్రస్తుత ఫాం, సెంచరీల మోత గురించి పక్కన పెడదాం. కానీ క్రికెట్ ప్రపంచం అంతా కోహ్లీ రీసెంట్ ఫాం చూశాక... చర్చించుకుంటోంది ఒక్కటే. వంద సెంచరీల మార్క్ ను అందుకుంటాడా.. సచిన్ సరసన చేరతాడా అని. అసలు విరాట్ ఆ స్థాయికి చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయా... ఇంకా ఎన్నేళ్లు, ఎన్ని మ్యాచెస్ ఆడతాడు. విరాట్ కు ఇప్పుడు 34 ఏళ్లు. ప్రస్తుత క్రికెటింగ్ ఏజ్ లో ఆడుతున్న మ్యాచుల సంఖ్య, 3 ఫార్మాట్లు, ఐపీఎల్, వర్క్ లోడ్ ఇవన్నీ చూసుకుంటే.... కోహ్లీ మహా అయితే మరో 2, రెండున్నరేళ్లు ఆటలో కొనసాగుతాడేమో. అఫ్ కోర్స్ ఫిట్ నెస్ పరంగా అతనికి ఎలాంటి వంకా పెట్టలేం. కానీ ఈ కాలంలో ఫాం ఎలా మెయింటైన్ చేస్తాడనేదే ఇంట్రెస్టింగ్.
ఇప్పుడు టీమిండియా టీ20 ప్లాన్స్ లో రోహిత్, విరాట్ దాదాపుగా లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా యంగ్ టీంను గ్రూమ్ చేస్తున్నారు. సో రాబోయే 2,3 ఏళ్లల్లో విరాట్ దాదాపుగా ఆడేది వన్డేలు, టెస్టులు, ఐపీఎల్ మాత్రమే. ఐపీఎల్ అంతర్జాతీయం కాదు కనుక ఆ వివరాలు పక్కన పెట్టేద్దాం.
ఇంకో 4 నాలుగు కొడితే చాలు....
శ్రీలంకతో ఆదివారం జరిగిన మూడో వన్డే ద్వారా విరాట్ సాధించిన ఇంటర్నేషనల్ సెంచరీల సంఖ్య 74. వన్డేల్లో 46. టెస్టుల్లో 27. టీ20ల్లో ఒకటి. వన్డేల్లో ఇంకో 4 నాలుగు కొడితే చాలు.... సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డ్ దాటేస్తాడు. ప్రస్తుతం ఉన్న ఫాం, ఈ ఏడాది వరల్డ్ కప్ ఉన్న దృష్ట్యా.... విరాట్ ఈ సంవత్సరమే ఆ చరిత్ర సృష్టించడానికి అవకాశాలు బీభత్సంగా ఉన్నాయి. కానీ విరాట్ ముందున్న అసలు సవాల్ టెస్టులు... టెస్టుల్లో మాస్టర్ బ్లాస్టర్ కొట్టినది... 51 సెంచరీలు. విరాట్ ప్రస్తుతం 27 సెంచరీలతో ఉన్నాడు. ఇప్పుడు వన్డేలు, టీ20ల్లో కోహ్లీ ఫాంలోకి వచ్చాడు కానీ.... టెస్టుల్లో ఇంకా మునపటి రేంజ్ అందుకోవాల్సి ఉంది. విరాట్ టెస్టుల్లో లాస్ట్ సెంచరీ సాధించి మూడేళ్లు పైనే అయిపోయింది.
రాబోయే రెండేళ్లల్లో అంటే ఈ ఏడాదంతా, అలాగే 2024లో మొత్తం ఇండియా ఆడబోయే మ్యాచెస్ ఏంటో చూద్దాం. అదే ఐసీసీ ఎఫ్టీపీ రిలీజ్ చేస్తుందిగా దాని ద్వారా. టీ20లు వదిలేద్దాం. ఎందుకంటే విరాట్ ఇక ఎక్కువగా టీ20లు ఆడకపోవచ్చు. ఆడినా సరే టీ20ల్లో సెంచరీ కొట్టే అవకాశాలు కొంచెం తక్కువే.
ముందు వన్డేల వివరాలు చూస్తే బుధవారం న్యూజిలాండ్ సిరీస్ తో మొదలుకుంటే 2024 చివరిదాకా 18 వన్డేలు టీమిండియా షెడ్యూల్ లో ఉన్నాయి. వీటికి వరల్డ్ కప్ మ్యాచులు అదనం. 10 టీమ్స్ ఉండే టోర్నీలో రౌండ్ రాబిన్ పద్ధతిలో టీమిండియా కచ్చితంగా 9 మ్యాచెస్ ఆడాలి. సెమీస్, ఫైనల్స్ కు వెళ్తే మరో 2 మ్యాచెస్. ఇవి పక్కన పెట్టేద్దాం. షెడ్యూల్ ప్రకారం 18 ప్లస్ 9 27 మ్యాచులు ఉన్నాయి. సో విరాట్ పూర్తి ఫిట్ గా ఉండి, అన్ని మ్యాచులకూ అందుబాటులో ఉంటే రెండేళ్లలో 27 వన్డేలు ఆడతాడు.
ప్రస్తుత ఫాంను కాస్త తగ్గించి చూసినా ప్రతి 3 వన్డేలకు ఓ సెంచరీ కొట్టినా సరే... వన్డేల్లో మరో 9 సెంచరీలు సాధిస్తాడు. అంటే వన్డేల కౌంట్ 55 కు పెరుగుతుంది. అండ్ ఈ పాటికే మనకో అంచనా వచ్చేసి ఉంటుంది. వన్డేల్లో ఎవరూ అందుకోలేని రికార్డులు విరాట్ కచ్చితంగా సృష్టిస్తాడు. పరుగుల ట్యాలీలో సచిన్ 18వేల 426 మార్క్ ను విరాట్ అందుకోలేకపోవచ్చు. ఎందుకంటే సచిన్ 452 ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కచ్చితంగా అన్ని ఆడలేడు. కానీ సెంచరీలు, స్ట్రైక్ రేట్, యావరేజ్ నంబర్స్ లో మాత్రం విరాట్ నంబర్ వన్ పొజిషన్ తో ముగుస్తాడనడంలో సందేహం లేదు.
కోహ్లీకి అసలైన సవాల్
టెస్టుల విషయానికి వస్తే ఇక్కడే కోహ్లీకి అసలైన సవాల్. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో స్టార్ట్ అవబోయే నాలుగు మ్యాచుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో మొదలుకుని 2024 చివరి దాకా.... టీమిండియా 23 టెస్టులు ఆడుతుంది. మనకు తెలుసు టెస్టులంటే విరాట్ ఫేవరెట్ ఫార్మాట్. ఫిట్ నెస్ కాపాడుకుంటే కచ్చితంగా ప్రతి టెస్ట్ ఆడటానికే మొగ్గు చూపుతాడు. సో ఈ 23 మ్యాచులకు అదనంగా ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తే అదో మ్యాచ్. 23 మ్యాచెస్ లో 46 ఇన్నింగ్స్ ఆడే అవకాశమున్నా సరే.... కొన్నిసార్లు వేర్వేరు కారణాల వల్లే ఒక టెస్టులో రెండుసార్లూ బ్యాటింగ్ కు దిగే అవకాశం ఉండదు. 23 లో ఓ సగం అంటే 11.5 పోనీ రౌండ్ ఫిగర్ పన్నెండు ఇన్నింగ్స్ పక్కన పెట్టేద్దాం. 34 ఇన్నింగ్స్. ఇప్పుడు వన్డేల్లో చూపిస్తున్న అద్భుత ఫాం టెస్టుల్లో కూడా రెప్లికేట్ చేస్తాడని ఆశిద్దాం. ప్రతి 3 ఇన్నింగ్స్ కు ఓ సెంచరీ కొట్టాడే అనుకోండి. 11 సెంచరీలు అవుతాయి. అంటే ప్రస్తుత 27 ప్లస్ 11... 2024 చివరి నాటికి 38 టెస్టు సెంచరీలు విరాట్ ఖాతాలో ఉంటాయి.
రాబోయే రెండేళ్లల్లో టీమిండియా ఆడబోయే మ్యాచుల సంఖ్య, విరాట్ ఎదురుగా ఉన్న అవకాశాలు ఇవి. ఇలాంటి ఫాం ఇలానే కొనసాగిస్తే.. పైన చెప్పుకున్న విధంగా విరాట్ రాణిస్తే 2024 చివరి నాటికి 36 ఏళ్ల విరాట్ ఖాతాలో 55 వన్డే సెంచరీలు, 38 టెస్టు సెంచరీలు ఉంటాయి. అంటే 93. ప్రస్తుత టీ20 సెంచరీ ఒకటి కలుపుకుంటే 94 అవుతుంది. రెండేళ్లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ అంచనాలు వేశాం. ఈ రెండేళ్లల్లో అంచనాలను మించి రాణించినా లేదా 2024 చివరి తర్వాత కనీసం మరో 8-10 నెలలు విరాట్ ఆటలో కొనసాగినా.... ఆ 6 సెంచరీలు కొట్టడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ 100 సెంచరీల రికార్డును దాటే ఛాన్స్ ఉంటుంది.
కానీ రెండేళ్లు, ఇన్నేసి మ్యాచులు, ఈ రేంజ్ ఫాం అంటే చెప్పుకున్నంత ఈజీ కాదు. చాలా అంటే చాలా కష్టమైన పని. స్టార్టింగ్ లో తెలిపినట్లే ఇది 2016 6 నాటి ఫాం అని. దాన్ని మళ్లీ రెప్లికేట్ చేస్తే చాలు. విరాట్ 100 వందల మార్క్ అందుకుంటాడు. బట్ ఇది చాలా సుదూర లక్ష్యం. విరాట్ కళ్లన్నీ ఇప్పుడు ఈ కప్ మీదే ఉంటుంది. అదే 2023 వరల్డ్ కప్. తను అద్భుతంగా రాణించి ఇండియాకు 12 ఏళ్ల తర్వాత మళ్లీ కప్ అందించాలన్న కసితో ఆడతాడనడంలో సందేహం లేదు. మీరు ఏమనుకుంటున్నారు ? విరాట్ వంద సెంచరీల మార్క్ అందుకుంటాడా లేదా... విరాట్ వంద శతకాలు బాదాలని ఆశిద్దాం.