ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ కెరీర్‌లో చివ‌రి ఇన్నింగ్స్‌ ఆడేశాడు. కేప్‌టౌన్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో అత‌డు ఆఖ‌రిసారి క్రీజులో అడుగుపెట్టాడు. అయితే.. చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన ఎల్గర్‌... రెండో ఇన్నింగ్స్‌లో 12 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. ముకేశ్ కుమార్ ఓవ‌ర్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ ప‌ట్టిన అనంత‌రం విరాట్.. ఎల్గర్‌ ద‌గ్గర‌కు వెళ్లి హ‌త్తుకున్నాడు. భార‌త్ జ‌ట్టు స‌భ్యులంతా స‌ఫారీ సార‌థిని అభినందించారు. అనంత‌రం ఎల్గర్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ స్టేడియంలోని అభిమానుల‌కు అభివాదం చేశాడు. ఫ్యాన్స్ అంద‌రూ లేచి నిల్చొని చ‌ప్పట్లు కొడుతూ అత‌డికి వీడ్కోలు ప‌లికారు.

 

చివరి టెస్ట్‌లో కెప్టెన్‌గా బరిలోకి..

చూరియన్‌ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారీ శతకంతో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన డీన్‌ ఎల్గర్‌ (Dean Elgar).. ఈ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు పలకనున్నాడు. ఇప్పటికే ప్రొటీస్‌ కెప్టెన్‌ బవుమా గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరం కావడంతో.. అతని స్థానంలో ఎల్గర్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్‌ (South Africa Captain Dean Elgar)గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌తో సిరీస్‌తో రిటైరవుతున్నట్లు ఎల్గర్‌ ముందే ప్రకటించాడు. 

 

పెను సంచలనం

పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సీమర్లు నిప్పులు చెరిగిన వేళ దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న కీలకమైన రెండో టెస్ట్‌లో... తొలిరోజే 23 వికెట్లు కుప్పకూలాయి. తొలి రోజే ప్రొటీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను కూడా ప్రారంభించి మూడు వికెట్లు కోల్పోయింది. ఇరు జట్లు చెత్త రికార్డులు నమోదు చేసిన ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం భారత్‌ స్వల్ప పైచేయి సాధించింది.  టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్ల పడిన. రెండో టెస్ట్‌గా ఇది నిలిచింది. 1902లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌లో తొలిరోజు 25 వికెట్లు నేలకూలగా  తర్వాత ఈ మ్యాచ్‌లోనే 23 వికెట్లు పడ్డాయి.

 

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలిరోజు ఆటలో పెను సంచలనం నమోదైంది. కేప్‌టౌన్‌లో పూర్తిగా పేసర్లకు సహకరించిన పిచ్‌పై ఇరు జట్ల సీమర్లు నిప్పులు చెరిగారు. తొలి రోజే 23 వికెట్లు నేలకూల్చి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశారు. అయితే టెస్ట్‌ క్రికెట్ చరిత్రలో ఇలా తొలిరోజే రెండు వికెట్లు పడడం ఇది రెండోసారే కావడం గమనార్హం. ఎప్పుడో 120 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిరోజు 25 వికెట్లు నేలకూలాయి. మళ్లీ దాదాపు శతాబ్దం తర్వాత ఈ మ్యాచ్‌లో ఒకేరోజు 23 వికెట్లు పడ్డాయి. 1902లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మ్యాచ్‌ జరగగా... ఇప్పుడు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మ్యాచ్‌ జరిగింది.

 

భారత్‌కు 98 పరుగుల ఆధిక్యం

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించే అవకాశాన్ని భారత్‌ చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 111 పరుగులకు 4 వికెట్లతో పటిష్టంగా కనిపించిన టీమిండియా 153 పరుగులకే కుప్పకూలింది. టీమ్‌ఇండియా(Team India) చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్‌ బుమ్రా (0) లను పెవిలియన్‌కు పంపాడు. 153 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌... అదే స్కోరు వద్ద ఆలౌట్‌ అయింది. టీమిండియా చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్‌ వద్ద కోల్పోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. . టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టు పరుగులేమీ చేయకుండా చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ అపఖ్యాతిని టీమిండియా మూటగట్టుగుంది. ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌ తర్వాత 153కు నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా... అదే 153 పరుగుల వద్ద 153 ఆలౌట్‌ అయింది. టీమిండియా 98 పరుగుల ఆధిక్యం సాధించింది.