MS Dhoni: క్రికెట్ టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(Ms Dhoni) హుక్కా తాగుతాడా... సోషల్‌ మీడియా(Social Media)లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ధోనీ హుక్కా తాగడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ హుక్కా కారణంగా ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కొత్త ఏడాది సంబరాల కోసం దుబాయ్‌ వెళ్లిన ధోనీ... అక్కడ ఫ్రెండ్స్‌తో జ‌రిగిన పార్టీలో హుక్కా తాగాడని సోషల్‌ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. మ‌హీ భాయ్ హుక్కా పీలుస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ధోనీకి ఈ అల‌వాటు కూడా ఉందా? అని షాక‌వుతున్నారు.


ఇంతకీ నిజమేంటంటే...


వైరల్ అవుతున్న ఈ వీడియోలో ధోనీ హుక్కా సేవిస్తున్నట్లు కనిపిస్తుంది నిజమే. కానీ, ఇది ఓ అడ్వర్టైజ్‌మెంట్‌లో భాగంగా చిత్రీకరించడం జరిగిందని.. యాడ్‌ ఏజెన్సీ ప్రకటించింది. యాడ్ షూటింగ్‌లో భాగంగా ధోనీ హుక్కా సేవించాల్సి వచ్చిందని సదరు యాడ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇక ఈ వీడియోలో ధోనీతో పాటు.. నటుడు సన్నీ సింగ్ కూడా ఉన్నాడు. ఆ పక్కనే రాపర్ ఎంసీ స్టాన్‌ కూడా ఉన్నాడు.


మోసపోయిన ధోనీ


టీమిండియా మాజీ సారథి, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni) మోసపోయాడు. మీరు వింటున్నది నిజమే. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీని ఓ కంపెనీ కోట్ల మేర మోసగించింది. క్రికెట్‌ అకాడమీ విషయంలో ధోనీ భాగస్వామిగా ఉన్న ఓ కంపెనీ ఆయన్ను రూ.15 కోట్ల మేర మోసగించింది. దీంతో ఆ భాగస్వామ్యం నుంచి వైదొలిగిన మహేంద్రుడు.. వారిపై క్రిమినల్‌ కేసు పెట్టారు. దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చిరాగానే మ‌హీ కోర్టును ఆశ్రయించాడు. క్రికెట్ అకాడ‌మీ పేరుతో త‌న‌ను మోసం చేసి రూ.15 కోట్లు కాజేసిన ఇద్దరిపై రాంచీ కోర్టులో కేసు పెట్టాడు.


ఇంతకీ ఏం జరిగిందంటే..?
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు.. ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌ సంస్థ 2017లో ధోనీతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆర్కా స్పోర్ట్స్‌.. ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజ్ ఫీజు, లాభాల్లో వాటా ఇస్తామ‌ని అగ్రిమెంట్‌లో రాసుకున్నారు. కానీ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతూ మ‌హీ భాయ్‌ను ఈ సంస్థ మోసం చేసింది. అయితే, ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ విఫలమైంది. దీనిపై ఆర్కా స్పోర్ట్స్‌ య‌జ‌మాని మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్‌లతో చర్చించినా ఫలితం లేకపోవడంతో.. ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగారు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను ఆయన రద్దు చేసుకున్నారు. అనంతరం పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ తాజాగా కోర్టును ఆశ్రయించారు. ధోనీ ఫిర్యాదుతో మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్‌ల‌పై క్రిమినల్‌ కేసు న‌మోదు చేశారు. . మరోవైపు ధోనీ మోస పోవడం పట్ల పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ధోనీ నమ్మిన వారు చీట్ చేశారని పలువురు అంటుండగా..దీన్నే బోల్తా కొట్టించారని ఇంకొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.