Vaibhav Sooryavanshi Ready For International Cricket: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరల్డ్ ఛాంపియన్ ఇండియా 0-2 తో ఘోరంగా వైట్‌వాష్ అవ్వడం క్రికెట్ సర్కిల్స్ లో ఒక బిగ్గెస్ట్ డిబేట్‌గా మారింది. ఆదివారం జరిగిన సెండ్ మ్యాచ్ లో కేవలం ఒక్క రన్ తేడాతో ఓడిపోయాక, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకోకపోవడంపై ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇండియా అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ వైభవ్ సెలెక్షన్ పై ఓపెన్ అయ్యాడు. వైభవ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేందుకు వంద శాతం రెడీగా ఉన్నాడని, అయితే మిగిలిన ప్లేయర్ల లాగే అతను కూడా ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుందని కోచ్ క్లారిటీ ఇచ్చాడు.

Continues below advertisement

Read Also: Team India White Washed VS Ireland T20 Series: ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!

సంజూ శాంసన్ కు సపోర్ట్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై మీడియా అడిగిన క్వశ్చన్ కు టెన్ డోషేట్ చాలా స్ట్రైట్ గా ఆన్సర్ ఇచ్చాడు. "వైభవ్ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మూడు నెలల క్రితం ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో సంజూ శాంసన్ కీ రోల్ ప్లే చేశాడు అనే విషయం మర్చిపోకూడదు" అని కోచ్ గుర్తు చేశాడు. శాంసన్ ఐపీఎల్ లోనూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని, టీమ్‌లోని ప్లేయర్లకు లాంగ్ రన్ ఇస్తూ వారిలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం మేనేజ్‌మెంట్‌కు చాలా ముఖ్యమని చెప్పాడు. వైభవ్ ఆటను చూడటానికి అందరూ ఎగ్జైట్‌గా ఉన్నా, ప్రతీ ప్లేయర్ వెళ్లాల్సిన సిస్టమ్ లోంచే అతను కూడా రావాలని, సిరీస్ స్టార్టింగ్ లో బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ చెప్పిన మాటలనే టెన్ డోషేట్ సమర్థించాడు.

Continues below advertisement

Read Also: T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్..

ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ విధ్వంసం..ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఏకంగా 230 కి పైగా మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ లోనే హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. టోటల్ గా 776 రన్స్ స్కోర్ చేసి సీజన్ 'మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' తో పాటు 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సంచలన ఫామ్ వల్లే అతన్ని టీమిండియాలోకి తీసుకోవాలనే ప్రెజర్ పెరుగుతోంది. ఐర్లాండ్ సిరీస్ లో ఒక మ్యాచ్ లోనైనా అతనికి డెబ్యూ ఛాన్స్ ఇస్తే బాగుండేదని క్రికెట్ లవర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డుకు ముప్పు.. ఇంగ్లాండ్ టూర్ పైనే కళ్లుఐర్లాండ్ టూర్ ముగియడంతో ఇండియా నెక్స్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనుంది. జులై 1 నుంచి చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ స్టార్ట్ కాబోతోంది. ఈ టూర్ లోనైనా వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్ లో ప్లేస్ దక్కుతుందా లేదా అనేది ప్రెజెంట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ డెబ్యూ ఇస్తే, ఇండియా క్రికెట్ హిస్టరీలోనే అత్యంత పిన్న వయసులో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు. గతంలో లెజెండ్ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల ఏజ్ లో ఇండియా తరఫున డెబ్యూ ఇచ్చి క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డును ఈ 15 ఏళ్ల యంగ్ బ్యాటర్ బ్రేక్ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.