Sooryavanshi Blitzkrieg Takes India To Big Score మూడో టీ20లోనూ భార‌త్ రెచ్చిపోయింది. స్లో వికెట్ పై బ్యాట‌ర్లు స‌త్తా చాట‌డంతో భారీ స్కోరు సాధించింది.  జింబాబ్వేతో హరారే వేదికగా శనివారం జరుగుతున్న‌ థర్డ్ అండ్ ఫైనల్ టి20 మ్యాచ్ లో ఇండియా బ్యాటర్లు మరోసారి పవర్ ఫుల్ షో చూపించారు. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సంచలన హాఫ్ సెంచరీ (49 బంతుల్లో 81 రన్స్, 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో చెలరేగడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 రన్స్ బిగ్ స్కోరు సాధించింది. బ్రాడ్ ఈవాన్స్ కు రెండు వికెట్లు ద‌క్కాయి.   ఆల్రెడీ సిరీస్ లో 2-0 తో ముందంజలో ఉన్న శ్రేయస్ అయ్యర్ సేన ఈ మ్యాచ్ ను కూడా గెలిచి కంప్లీట్ గా క్లీన్ స్వీప్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

Continues below advertisement

Continues below advertisement

టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్.. ప్లేయింగ్ ఎలెవన్ లో టూ బిగ్ చేంజెస్ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయపడిన ప్రిన్స్ యాదవ్ స్థానంలో పేసర్ అశోక్ శర్మను, శివమ్ దూబే ప్లేస్ లో సూర్యాన్ష్ షెడ్గేను టీమ్ లోకి తీసుకున్నారు. జింబాబ్వే టీమ్ లో పేసర్ రిచర్డ్ ఎంగరావా గాయం వల్ల బెంచ్ కి పరిమితమవ్వగా, అతనికి ప్రత్యామ్నాయంగా వెల్లింగ్టన్ మసకద్జా ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. స్లోగా ఉన్న హరారే పిచ్ పై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఇండియాకు సాలిడ్ ఫౌండేషన్ వేశాడు. ఇక ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 92) మ‌రోసారి విఫ‌ల‌మై నిరాశ ప‌ర్చాడు. వ‌న్ డౌన్ లో వ‌చ్చిన ఇషాన్ (29) తో క‌లిసి వైభ‌వ్.. 75 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో 31 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

వైభవ్ సూర్యవంశీ ఫోర్ల సిక్సర్ల వర్షం.. వైభవ్ సూర్యవంశీ తన 49 బంతుల ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ ఔటైన త‌ర్వాత‌.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (27) తో క‌లిసి 50 ప‌రుగులు జోడించాడు. అయితే సెంచ‌రీకి చేరువైన క్ర‌మంలో ఔటై, నిరాశ ప‌ర్చాడు. చివ‌ర్లో రింకూ సింగ్ (14బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్స‌ర్) లు క్యామియో ఇన్నింగ్స్ తో సపోర్ట్ అందించడంతో ఇండియా 192 రన్స్ స్కోర్ చేయగలిగింది. తెలుగు స్టార్ తిలక్ వ‌ర్మ (11 నాటౌట్) అజేయంగా నిలిచాడు.  ఈ బిగ్ టార్గెట్ ను ఛేజ్ చేయడం జింబాబ్వేకు చాలా టఫ్ టాస్క్ కానుంది.

క్లీన్ స్వీప్ వైపు ఇండియా అడుగులు.. ఫైట్ ఇచ్చేందుకు జింబాబ్వే రెడీఇండియన్ బౌలింగ్ లైనప్ లో కొంతమంది ఇన్‌ఎక్స్‌పీరియన్స్డ్ బౌలర్లు ఉన్నందున ఈ మ్యాచ్ లో గెలిచేందుకు జింబాబ్వే గట్టిగా ట్రై చేసే స్కోప్ ఉంది. అయితే ఈజీ విక్టరీతో సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకోవడమే తమ మెయిన్ టార్గెట్ అని తెలుస్తోంది. ఇక వ‌రుస‌గా రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా.. మ‌రోసారి టీ20 నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును ద‌క్కించుకోగా, మూడో టీ20లో విజయంతో దాన్ని ప‌టిష్టం చేసుకోవాల‌ని భావిస్తోంది.