Is Yusuf Pathan Contesting In Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల బరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్(Yusuf Pathan) దిగాడు. పశ్చిమ బెంగాల్‌(West Bangal)లో ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ(Mamata ) ప్రకటించిన 42 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాలో యూసుఫ్‌ పఠాన్‌ పేరు కూడా ఉంది. పఠాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(The Trinamool Congress) ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నాడు. వెస్ట్‌ బెంగాల్‌లోని బరంపూర్‌ నియోజకవర్గం నుంచి యూసఫ్‌ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దించింది. ఆదివారం ఉదయమే తృణమూల్‌ యూసుఫ్‌ పఠాన్‌ టీఎంసీలో చేరాడు. అలా చేరాడో లేదో పఠాన్‌కు దీదీ టికెట్‌ కేటాయించింది. బరంపూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ లోక్‌సభ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ ఎంపీగా ఉన్నాడు. చౌదరీ గతంలో ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మరో మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్ దుర్గాపుర్ నుంచి  లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 



షమీ కూడా బరిలో దిగుతాడా..? 
టీమిండియా(Team India)కు చెందిన మరో స్టార్‌ క్రికెటర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు  తెలుస్తోంది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ(Mohammed Shami) రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. షమీ బీజేపీ(BJP)లో చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షమీ  పశ్చిమ బెంగాల్‌(West Bangal) నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నాయి.



ఇటీవలే షమీ గురించి మోదీ ట్వీట్‌
చీలమండ గాయం కారణంగా క్రికెట్(Cricker) కు దూరంగా ఉన్న భారత పేసర్ మహమ్మద్ షమీ(Mohammad Shami) తనకు లండన్‌లో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందంటూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలను పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని షమీ చెప్పాడు. అయితే ఈ విషయంపై ప్రధాని(PM) స్పందించారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని మోదీ(Modi) ఆకాంక్షించారు. షమీ వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకొని దేశం తరపున ఆడాల‌ని కోరుకుంటున్నానని ఆయ‌న ట్వీట్ చేశారు.


గత నవంబరులో ప్రపంచకప్‌ ఫైనల్‌లో చివరి మ్యాచ్ ఆడాడు షమ్మీ. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు కూడా అందుబాటులోకి రాలేదు. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌కు అతనికి విశ్రాంతి ఇచ్చారు. జనవరి చివరి వారంలో లండన్‌లో కొన్ని చీలమండ ఇంజెక్షన్లు తీసుకున్న షమి తేలికపాటి పరుగులు సాధన చేశాడు. అయితే 3 వారాల తర్వాత ఇంజెక్షన్ల ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో  నొప్పి మళ్లీ తిరగబెట్టింది. ఇక శస్త్రచికిత్స మినహా మరే మార్గంలేదని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. నొప్పితోనే ప్రపంచకప్ ఆడిన షమి ఆ ప్రభావం మ్యాచ్‌లపై పడనివ్వలేదని సమాచారం..