Third T20 match between Sri Lanka and New Zealand was played like a thriller: అందరూ భారత డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగింది.. రోహిత్ శర్మ, గంభీర్ ఎలా మాట్లాడుకున్నారు.. పొట్లాడుకున్నారు అని ఆసక్తిగా చూస్తున్న సమయంలో ఓ ధ్రిల్లర్ టీ 20 మ్యాచ్ జరిగిపోయింది. రెండు జట్లు పరుగుల వరద పారించినా.. చివరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్‌లో ఫలితం తేలింది.
న్యూజిలాండ్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటిస్తోంది. శ్రీలంక క్రికెట్ ప్రమాణాలు ఇటీవల కాలంలో దారుణంగా పడిపోవడంతో ఎవరూ పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు. అందుకే చాలా మంది ఈ టూర్‌లో శ్రీలంక ఏం ఆడుతుందిలేఅని లైట్ తీసుకున్నారు. కానీ డిసెంబర్ 31న న్యూజిలాండ్ లో జరిగిన పార్టీలో ఏం పుచ్చుకున్నారో కానీ.. ఈ ఏడాది జరిగిన తొలి టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్.. తమ టూర్‌లో మూడో టీ ట్వంటీ మ్యాచ్‌లో చెలరేగిపోయారు. ఫోర్లు సిక్సర్లతో హోరెత్తించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓవర్ కు పది పరుగులకు తగ్గకుండా రన్ రేట్ మెయిన్‌టెయిన్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. శ్రీలంక తరపున కుశాల్ పెరీరా పరుగుల వర్షం కురిపించాడు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసి శ్రీలంక తరపున సరికొత్త రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌పై కుశాల్ పెరీరా 44 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇది శ్రీలంక తరపున అత్యధిక ఫాస్టెస్ట్ టీ ట్వంటీ సెంచరీ. 2011లో తిలకరత్న దిల్షాన్ 55 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును అధిగమించాడు.
న్యూజిలాండ్ కూడా గట్టిగానే పోరాడింది. అయితే చివరి ఓవర్ లో అనుకున్న విధంగా షాట్లు ఆడలేకపోవడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ విధంగా రెండు జట్లు 429 పరుగులు నమోదు చేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో మొత్తం స్కోర్లు నమోదయ్యాయి. స్కోర్లలో మొత్తం ఇరవై ఐదు సిక్సులు నమోదయ్యాయి. ఇందులో న్యూజిలాండ్ ఆటగాళ్లు పదమూడు కొట్టారు.
శ్రీలంక క్రికెట్‌కు గడ్డుపరిస్థితుల్లో ఉంది. ఆటగాళ్లు రాణించకపోవడంతో ప్రమాణాలు పడిపోయాయి. న్యూజిలాండ్ తో జరిగిన రెండు టీ ట్వంటీల్లోనూ ఓడిపోయింది. దీనిపైనా ఆశలు లేవనుకున్నారు. కానీ కొత్త ఏడాదిలో మాత్రం మారిపోయారు. మరి ఈ జోరు కంటిన్యూ చేస్తారా ?