Bumrah at the Gabba: ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT 2024-25)లో టీమిండియా స్టార్ పేసర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పేరు ఎత్తితే చాలు.. కంగారు బ్యాటర్లు కంగారు పడిపోతున్నారు. గతం రెండు టెస్టుల్లో 12 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఆస్ట్రేలియా(Australia)లో ఏ దేశం పర్యటించినా ఎప్పుడూ కంగారు పేసర్ల గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ తాజాగా బుమ్రాపైన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, అక్కడి మీడియా తీవ్రంగా చర్చిస్తున్నాయి. పేస్ కు స్వర్గధామంగా ఉండే గబ్బా( Gabba) పిచ్ పై బుమ్రాను ఎదుర్కోవడం అంత తేలిక కాదని ఆస్ట్రేలియన్లు ఇప్పటికే భయపడుతున్నారు. బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో సూచనలు కూడా చేస్తున్నారు.
Jasprit Bumrah: బుమ్రా పేరు వింటేనే వణుకుతున్న కంగారు బ్యాటర్లు , గబ్బాలో నిలబడగలరా..?
Jyotsna
Updated at:
12 Dec 2024 01:34 PM (IST)
BGT 2024-25: టీమిండియా స్టార్ పేసర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు ఎత్తితే చాలు.. కంగారు బ్యాటర్లు కంగారు పడిపోతున్నారు. బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో సూచనలు కూడా చేస్తున్నారు.
బుమ్రా పేరు వింటేనే వణుకుతున్న కంగారు బ్యాటర్లు
NEXT
PREV
గబ్బా పిచ్ అలానే ఉంటే కంగారులకు కష్టమే..
గత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ గెలిచింది. ఆ మ్యాచులో ఘన విజయం సాధించిన భారత జట్టు... గత బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని 2-1తో గెలుచుకుంది. అయితే ఈసారి గబ్బా పిచ్ పై బుమ్రా ఎంత ప్రభావం చూపుతాడనే దానిపైనే టీమిండియా విజయావకాశాలు అధారపడి ఉన్నాయి. అయితే మ్యాచ్ ప్రారంభంలో గబ్బా వికెట్ ఎలా ఉంటుందో అయిదు రోజులు అదే విధంగా ఉంటుందని బ్రిస్బేన్ పిచ్ క్యూరేటర్ డేవిడ్ సందుర్స్ వెల్లడించారు. " పిచ్ విభిన్నంగా స్పందిస్తుంది. పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ సమయం గడుస్తున్నా కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది" అని పిచ్ క్యూరేటర్ తెలిపారు. ఫాస్ట్ బౌలర్లకు వికెట్ మరింత అనుకూలంగా ఉంటుందని.. కానీ దాని కోసం పిచ్ ను ప్రత్యేకంగా ఏమీ రూపొందించలేదని డేవిడ్ తెలిపారు. సిరీస్‌లోని మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లు మంచి బౌన్స్ వికెట్లపై జరిగాయి. ఈ పిచ్ కూడా మంచి పేస్ వికెట్ పై జరగనుందని పరోక్షంగా క్యూరేటర్ వెల్లడించారు. “సాధారణంగా గబ్బా.. మంచి పేస్, బౌన్స్‌లకు ప్రసిద్ధి. ఈసారి కూడా మేం అలాంటి పిచ్‌ను సరిగ్గా సిద్ధం చేస్తాం. ప్రతి ఏడాది మాదిరిగానే సాంప్రదాయ గబ్బా వికెట్‌ను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ”అని క్యూరేటర్ తెలిపారు.
కంగారు బ్యాటర్లకు సూచనలు..
గబ్బా పిచ్ పేస్ కు అనుకూలిస్తుందన్న అంచనాలతో ఆస్ట్రేలియా బ్యాటర్లు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మాజీలు.. బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో కంగారు బ్యాటర్లకు సూచిస్తున్నారు. భారత్‌తో జరిగే మిగిలిన టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సూచించాడు. ఓపిగ్గా ఆడితే బ్యాటర్లు ఔట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి బుమ్రాపై ఎదురుదాడి దాడి చేయడం ఉత్తమమని సూచించాడు. మొదటి రెండు టెస్టుల్లో బుమ్రా మొత్తం 12 వికెట్లు పడగొట్టాడని గుర్తు చేశాడు. " ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ ను ఎదుర్కొంటున్నప్పుడు.. అతనిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒత్తిడికి గురికావద్దు. బుమ్రాపై ఎదురుదాడికి దిగి ఫలితాలు రాబట్టండి" అని సూచించారు.
Published at:
12 Dec 2024 01:34 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -