Home Coming team India: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup)ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా క్రికెట్ జట్టు బార్బడోస్(Barbados)లో తుఫాను లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి వాతావరణం కాస్త అనుకూలంగా మారటం, అలాగే భారత్ పంపిన ప్రత్యేక విమానం అక్కడ చేరుకోవడంతో జట్టు సభ్యులు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆటగాళ్ళు ఆనందంతో సోషల్ మీడియా లో ఫోటోలు పోస్ట్ చేస్తునారు.
జూన్ 29న టీ 20 ప్రపంచకప్ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన తరువాత నుంచి భారత జట్టు బార్బడోస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ద్వీప భూమిలో తుఫాను బీభత్సం సృష్టిస్తుండడంతో బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఇతర ప్రాంతాలకు రాక పోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం తుఫాను విరామం ఇవ్వటంతో గెలిచిన రెండురోజుల తరువాత ఆటగాళ్ళు స్వదేశానికి రానున్నారు. దీంతో ఆటగాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ లు చేస్తున్నారు. కమింగ్ హోమ్ అంటూ రోహిత్ శర్మ సూర్య కుమార్ యాదవ్ తో కలిసి ఫోటోను ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు.