Rohit Sharma Loses 12th Toss : 12సార్లు టాస్ ఓడిపోయి రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ
Rohit Sharma Toss Record: ఇండియా vs న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా వరుసగా రికార్డు స్థాయిలో టాస్ ఓడిపోయింది.

Rohit Sharma Loses 12th Toss : మార్చి 9 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియా vs న్యూజిలాండ్ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయారు. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ టాస్ ఓడిపోయి బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఇది వన్డేల్లో భారత్ వరుసగా 15వ టాస్ ఓటమి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 12 సార్లు ఇలా జరిగితే కెఎల్ రాహుల్ నాయకత్వంలో మూడుసార్లు టాస్ ఓడిపోయింది. ముఖ్యంగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఫైనల్ వరకు వచ్చిన టీమిండియా దుబాయ్‌లో నాలుగుసార్లు టాస్ ఓడిపోయింది.
వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా గతంలో అక్టోబర్ 1998, మే 1999 మధ్య 12 సార్లు టాస్ ఓడిపోయి రికార్డు సృష్టించారు. దాన్ని ఇప్పుడు రోహిత్ శర్మ ఈక్వల్ చేశాడు.
భారతదేశం టాస్-ఓటముల పరంపర 2023లో అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాపై ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా పర్యటనలో జోహన్నెస్‌బర్గ్, పార్ల్‌లలో ఓడిపోయింది. 2024లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ మూడుసార్లు టాస్‌లు ఓడిపోయింది.
వన్డేల్లో వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన కెప్టెన్లు వీళ్లే
వన్డేల్లో కెప్టెన్ వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన కెప్టెన్లు
12: బ్రియాన్ లారా (వెస్టిండీస్, అక్టోబర్ 1998 - మే 1999)
12: రోహిత్ శర్మ (భారతదేశం, నవంబర్ 2023 - మార్చి 2025)
11: పీటర్ బోరెన్ (నెదర్లాండ్స్, మార్చి 2011 - ఆగస్టు 2013)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో భారత జట్టు ఒక్క టాస్ కూడా గెలవకపోవడం ఒక వింతైన ఘనత. గ్రూప్ దశలో భారతదేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను ఓడించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై టాస్ ఓడిపోయినప్పటికీ, టీం ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ ఫైనల్లో కూడా టాస్ ఓడిపోయాడు.