Suryakumar Yadav Press Conference For IND vs PAK: కొలంబో: టీ20 వరల్డ్ కప్ 2026లో హైవోల్టేజ్ మ్యాచ్, మినీ ఫైనల్ అని అంతా అంటున్నారు. కానీ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ గాలి తీసేశాడు. సగం మ్యాచులు వాళ్లు, సగం మేం గెలిస్తే కనుక పాక్ ను ప్రత్యర్థి అని, సమ ఉజ్జి అని పిలవొచ్చు. కానీ దాదాపు అన్ని మ్యాచులు ఒకే జట్టు గెలిచిందంటే అవతలి జట్టు బలమైన ప్రత్యర్థి కాదు అని సూర్య అన్నాడు. 24 గంటల్లో విషయం తేలిపోతుందన్నాడు.

Continues below advertisement

భారత్, పాకిస్థాన్ మధ్య పోరు ఫిబ్రవరి 15న  ఆదివారం నాడు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పాక్ కెప్టెన్ కోరుకుంటున్నాడు కదా, అభిషేక్ శర్మ (Abhishek Sharma) రేపటి మ్యాచ్ ఆడతాడు అని స్పష్టం చేశాడు. నమీబియాతో జరిగిన గత మ్యాచ్‌లో కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ శర్మ రెస్ట్ తీసుకున్నాడు. అభిషేక్ జట్టులోకి రావడంతో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కు అవకాశం దక్కదని తెలుస్తోంది. 

ఉస్మాన్ తారిక్ కోసం ఇండియా ప్రాక్టీస్..

Continues below advertisement

పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు భారత జట్టు ప్రాక్టీస్ట చేస్తుందన్నాడు. తారిక్ తన వభిన్నమైన, అసాధారణమైన బౌలింగ్ యాక్షన్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడని సూర్య కుమార్ అన్నాడు. ఒకవేళ ప్రశ్న సిలబస్ బయటి నుంచి వచ్చినా, దానిని వదిలేయలేమని ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. తారిక్ ఒక ప్రత్యేకమైన బౌలర్ అయినప్పటికీ, అతడి బౌలింగ్ ఎదుర్కొనేందుకు జట్టు చాలా ఉత్సాహంగా ఉందని తెలిపాడు. ప్రాక్టీస్ సెషన్లో సూర్య సైతం ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ అనుకరిస్తూ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.

భారత్-పాక్ మ్యాచ్ ఒత్తిడి ఉందా..

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి ఒత్తిడి గురించి సూర్యకుమార్ ఆసక్తికరంగా స్పందించాడు. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని అన్నాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రత్యేకమైన సందర్భం. ఒత్తిడికి లోనవ్వడం మానవ స్వభావం. కానీ పాక్ జట్టు తమకు సమ ఉజ్జీ మాత్రం కాదని, దాదాపు అన్ని మ్యాచ్ లలో టీమిండియానే నెగ్గిందని పేర్కొన్నాడు. పాక్ సాధారణ జట్టే కానీ బలమైన ప్రత్యర్థిగా భావించడం లేదని అంచనాలు పెంచేశాడు..

హ్యాండ్‌షేక్ (కరచాలనం) పై

టాస్ సందర్భంగా, మ్యాచ్ ముగిసిన తరువాత హ్యాండ్‌షేక్ గురించి అడిగిన ప్రశ్నకు సూర్య చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా అని అప్పుడు ఆలోచిస్తామని భారత కెప్టెన్ సూర్యకుమార్ తెలివిగా బదులిచ్చాడు. 

భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్

భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణ గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అది తమ చేతుల్లో లేదని తెలిపాడు. దానిపై క్లారిటీ వచ్చినప్పుడు, అందరికీ తప్పకుండా చెబుతా అన్నాడు.