Gavaskar Comments: దాయాది పాకిస్తాన్ పై దిగ్గజ భారత క్రికెటర్ సునీల్ గావస్కర్ ఫైరయ్యాడు. భారత బీ టీమ్ కూడా వారిని సులభంగా ఓడించ‌గ‌ల‌ద‌ని విమ‌ర్శించాడు. ఆ జ‌ట్టులో బెంచ్ స్ట్రెంగ్త్ త‌గ్గిపోయింద‌ని పేర్కొన్నాడు. 1996 త‌ర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్య‌మిచ్చిన పాక్.. గ్రూపు ద‌శ‌లోనే ఇంటిముఖం ప‌ట్టింది. ఇప్ప‌టికి ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓట‌మి పాలై టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఈనెల 27న బంగ్లాదేశ్ తో ఆఖ‌రి లీగ్ మ్యాచ్ ఆడ‌నుంది. ఇందులో విజ‌యం సాధించినా ఏలాంటి ఉప‌యోగం ఉండదు. తాజా పాకిస్థాన్ ప్ర‌దర్శ‌న‌పై గావ‌స్క‌ర్ ఫైర‌య్యాడు. ప్ర‌స్తుత భార‌త జ‌ట్టుతో త‌ల‌ప‌డే సామ‌ర్థ్యం ఆ జ‌ట్టుకు లేద‌ని వ్యాఖ్యానించాడు. భార‌త్ నుంచి బీ, సీ టీమ్ లు పంపంచి పాక్ తో ఆడిస్తే క‌చ్చితంగా బీ టీమ్ చేతిలో పాక్ ఓడిపోతుంద‌ని వ్యాఖ్యానించాడు. కొద్దో గొప్పో సీ టీమ్ పై కాస్త మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయొచ్చ‌ని పేర్కొన్నాడు. పాక్ రిజ‌ర్వ్ బెంచ్ బ‌లంగా లేక‌పోవ‌డంతోనే ప్ర‌స్తుతం ఇలాంటి సంక్షోభం ఎదుర్కొంటోంద‌ని వ్యాఖ్యానించాడు. 

గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేదు..ఇంత‌టి బ‌ల‌హీన‌మైన పాక్ జ‌ట్టును గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని గావ‌స్క‌ర్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. న్యాచుర‌ల్ టాలెంట్ కు పాక్ పెట్టింది పేర‌ని, ఆ జ‌ట్టు నుంచి ఎంతోమంది ఆట‌గాళ్లు అంత‌ర్జాతీయ య‌వ‌నికపై పేరు గాంచార‌ని గుర్తు చేశాడు. ఆ త‌రంలో టెక్నిక‌ల్ సౌండ్ లేకున్నా, టెంప‌ర్ మెంట్ తో ఆక‌ట్టుకునేవార‌ని తెలిపాడు. ఇంజామాముల్ హ‌క్ లాంటి ప్లేయ‌ర్లు మంచి స్టాన్స్ తో నిల‌బ‌డ లేకున్నా, టెంప‌ర్ మెంట్ తో ప‌రుగులు సాధించి విజ‌య‌వంత‌మ‌య్యార‌ని, గ‌తంలో ఎంతో మంది పాక్ ప్లేయ‌ర్లు క్రికెట్లో స‌త్తా చాటార‌ని తెలిపాడు. 

పీఎస్ఎల్ దండుగ..ఐపీఎల్ కు పోటీగా తీసుకొచ్చిన పాకిస్థాన్ ప్రీమియ‌ర్ లీగ్ (పీఎస్ఎల్) వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింద‌ని గావాస్క‌ర్ వ్యాఖ్యానించాడు. భార‌త్ లో ఐపీఎల్ వ‌ల్ల ఎంతోమంది వెలుగులోకి వ‌చ్చి, టీమిండియా త‌ర‌పున అద‌ర‌గొడుతున్నార‌ని, పీఎస్ ఎల్ వ‌ల్ల పాక్ అలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని ఆక్షేపించాడు. బెంచ్ స్ట్రెంగ్త్ ను బ‌లోపేతం చేస్తేనే పాక్ బాగుప‌డుతుంద‌ని వ్యాఖ్యానించాడు. 2017లో ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ సాధించాక వ‌న్డేల్లో ఆ జ‌ట్టు ప‌త‌నం స్టార్ట్ అయింది. రెండు ప్ర‌పంచ‌క‌ప్పుల్లో ఆ జ‌ట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఇండియాతో ఆరు మ్యాచ్ లు ఆడ‌గా,, ఐదింటిలో ఓడిపోగా, ఒక మ్యాచ్ లో ఫ‌లితం రాలేదు. ఎనిమిది జ‌ట్లు పాల్గొంటున్న చాంపియ‌న్స్ ట్రోఫీలో ఇప్ప‌టికే పాక్, బంగ్లా జ‌ట్టు ఇంటిముఖం ప‌ట్టాయి.  సెమీస్ కు చేరిన ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ మార్చి 2న జరుగుతుంది. 

Read Also: Sachin Vs Kohli: సచిన్ కంటే కోహ్లీనే గొప్ప.. ఆ ఫార్మాట్లో అతడిని కొట్టేవారు లేరు.. మాజీ క్రికెటర్ల ప్రశంసలు