Sri Lankan Batters Stun England With Monumental 430 Run Chase In Rawalpindi Tri Series Thriller: పాకిస్థాన్ వన్డే ట్రై సిరీస్ 2026లో భాగంగా గురువారం రావల్పిండి వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో శ్రీలంక అద్భుత రికార్డును నమోదు చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 430 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని లంక బ్యాటర్లు వేటాడి వన్డే క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌ను నమోదు చేశారు. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 438/9 స్కోరుతో ఛేదించిన మ్యాచ్ మాత్రమే దీనికంటే ముందుంది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 116 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 202 పరుగులు చేసి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. జో రూట్ (69), విల్ జాక్స్ (66 నాటౌట్) రాణించడంతో ఇంగ్లండ్ 429/4 భారీ స్కోరు సాధించినప్పటికీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.

Continues below advertisement

Continues below advertisement

రత్నాయకే శతక గర్జన: ఫెర్నాండో బాధ్యతాయుత ఇన్నింగ్స్430 పరుగుల భారీ ఛేజింగ్‌లో శ్రీలంక ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో అవిష్క ఫెర్నాండో, పవన్ రత్నాయకే అద్భుత భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రత్నాయకే కేవలం 106 బంతుల్లోనే 130 పరుగులతో సూపర్ సెంచరీ బాది జట్టును పోటీలోకి తెచ్చాడు. మరో ఎండ్‌లో నిలకడగా ఆడిన అవిష్క ఫెర్నాండో 83 బంతుల్లో 97 పరుగులు చేసి కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరి నిలకడైన ఆటతీరుతో శ్రీలంక స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 

దాసున్ శనక మెరుపు విధ్వంసం: 50 బంతుల్లో 97 పరుగులుమిడిల్ ఓవర్లలో క్రీజులోకి వచ్చిన దాసున్ శనక విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 50 బంతుల్లోనే ఎనిమిది భారీ సిక్సర్లతో 97 పరుగులు సాధించాడు. శనక కూడా మూడు పరుగుల దూరంలో సెంచరీ మిస్సయినప్పటికీ, అతడి మెరుపు బ్యాటింగ్ మ్యాచ్‌ను లంక వైపు తిప్పేసింది.

లియనాగే అజేయ పోరాటం: చారిత్రక విజయం సొంతంఆఖరి ఓవర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ జనిత్ లియనాగే అజేయ అర్ధ శతకంతో కడవరకు నిలిచి పోరాడాడు. చివరకు శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 430 పరుగులు చేసి చిరస్మరణీయ గెలుపును అందుకుంది. ఈ విజయంతో  భారత్‌ రికార్డులను దాటి లంక దూసుకెళ్లింది. మొత్తం మీద‌ పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజింగ్‌ల రికార్డుల్లో 2006లో జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా ఆస్ట్రేలియాపై 438/9 స్కోరుతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇక‌ రావల్పిండిలో ఇంగ్లండ్‌పై 430/8 పరుగులు చేసి గెలిచిన శ్రీలంక రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో గువాహటిలో వెస్టిండీస్‌పై 406/2 స్కోరుతో గెలిచిన ఇండియా మూడో స్థానంలో, 2025లో డుండీలో స్కాట్లాండ్‌పై 374/6 సాధించిన నెదర్లాండ్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. అలాగే 2016 డర్బన్ వన్డేలో ఆస్ట్రేలియాపై 372/6తో గెలిచిన దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో, 2019 బ్రిడ్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌పై 364/4 నమోదు చేసిన ఇంగ్లండ్ ఆరో స్థానంలో నిలవగా, 2013 జైపూర్ పోరులో ఆస్ట్రేలియాపై 362/1తో ఘనవిజయం సాధించిన టీమిండియా ఏడో స్థానంలో ఉంది.