క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. ఈ టోర్నీ జూన్ 1 నుంచి జూన్ 29వరకు జరగనుంది. జూన్ 1న జరిగే తొలి మ్యాచ్ లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడనుంది. ఈ టోర్నీలో.. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్ లో.... తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ -Aలో భారత్ , పాకిస్థాన్ , ఐర్లండ్ , అమెరికా, కెనెడాలు ఉన్నాయి. క్రికెట్ అభిమానులు.... ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం జూన్ 9న న్యూయార్క్ లో జరగనుంది. గ్రూప్ దశలో భారత్ జూన్ ఐదున ఐర్లాండ్ తో, 12న అమెరికాతో, 15న కెనడాతో తలపడనుంది.
ఏ గ్రూపులో ఏ జట్టంటే...
గ్రూప్-ఏ: భారత్, పాక్‌లతో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ
గ్రూప్-బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్-సి: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండ, పపువా న్యూ గినియా..
గ్రూప్-డి: సౌతాఫ్రికా, శ్రీలంక. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు
క్లిష్టంగా గ్రూప్ డీ
అన్ని గ్రూపుల కంటే గ్రూప్-డి పటిష్టంగా కనిపిస్తోంది. ఈ గ్రూప్ నుంచి సూపర్-8కు వచ్చే జట్లను ముందే ఊహించడం కష్టంగా మారింది. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా, శ్రీలంక. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీ 20 క్రికెట్‌లో ఈ రెండు జట్లు అద్భుతాలు సృష్టించగలవు. ఇప్పటికే దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ రెండుసార్లు ఓడించింది. గత టీ20 ప్రపంచకప్‌తో పాటు గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. మరోసారి ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
పాక్ భారత్ పోరు ఆ తేదీనే...
ఈ టోర్నీలో.. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో.... తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, ఐర్లండ్, అమెరికా, కెనెడాలు ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం జూన్ 9న న్యూయార్క్‌లో జరగనుంది. గ్రూప్ దశలో భారత్ జూన్ ఐదున ఐర్లాండ్‌తో, 12న అమెరికాతో, 15న కెనడాతో తలపడనుంది.
టీ 20 ప్రపంచకప్‌లో భారత్ షెడ్యూల్
ఇండియా vs ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)