Team India Latest News: భార‌త క్రికెట్ జట్టుకు ప్ర‌స్తుతం మూడు ఫార్మాట్ల‌కు సంబంధించి ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. టెస్టు కెప్టెన్ గా శుభ‌మాన్ గిల్, వ‌న్డే కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ‌, టీ20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాద‌వ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే అన్ని ఫార్మాట్ల‌కు క‌లిపి ఒకే కెప్టెన్ ఉండబోతాడ‌ని ప‌లువురు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. విదేశాల్లోగా ఫార్మాట్ కు ఒక ప్లేయ‌ర్ ఉండ‌టం టీమిండియాకు స‌రికాద‌ని, చ‌రిత్ర ప్ర‌కారంగా చూసుకున్నా, అలా ఉన్న సందర్భాల్లో జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న అంతంత‌మాత్రంగానే ఉంద‌ని తెలిపారు. ఈక్ర‌మంలో టెస్టు కెప్టెన్ గా త‌న‌ను తాను నిరూపించుకున్న గిల్ కే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ ల‌భించే అవ‌కాశ‌ముంది. ఇటీవ‌ల ఇంగ్లాండ్ టూర్ లో బ్యాట‌ర్ గా లీడింగ్ స్కోర‌ర్ గా నిలిచిన గిల్.. స్ఫూర్తి మంత‌మైన కెప్టెన్సీతో సిరీస్ ను 2-2తో స‌మం చేశాడు. దీంతో అత‌నిపై ఉన్న అంచనాలు ఆకాశానికి చేరాయి. ఈ నేప‌థ్యంలో మాజీ సెలెక్ట‌ర్ దేవాంగ్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. 

కోహ్లీ లాగానే..ప్ర‌స్తుతం గిల్ ను చూస్తుంటే గ‌తంలో స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీలాగానే క‌నిపిస్తున్నాడని దేవాంగ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా కెప్టెన్సీ కొత్త‌లో అద్భుతంగా రాణించి, అన్ని ఫార్మాట్ల కెప్టెన్ గా కోహ్లీ ఎదిగిన వైనాన్ని గుర్తు చేశాడు. గిల్ లోనూ ఆ ప్ర‌తిభ పుష్క‌లంగా ఉంద‌ని, త్వ‌ర‌లోనే త‌ను అన్ని ఫార్మాట్ల కెప్టెన్ గా అవుతాడ‌ని జోస్యం చెప్పాడు. ముఖ్యంగా టెస్టు కెప్టెన్ గా గిల్ ను ఎంపిక చేయ‌డం చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ దూర దృష్టికి నిద‌ర్శ‌మ‌ని, ఇంగ్లాండ్ టూర్ తో త‌ను అంద‌రికీ స‌మాధానం చెప్పాడ‌ని పేర్కొన్నాడు. గ‌తంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయ‌క‌త్వంలో కోహ్లీ బాగా రాటుదేలాడ‌ని, ఇక గిల్ కూడా ఆ ద‌శ‌ను దాట‌డ‌ని చెప్పాడు. 

గిల్ జోరు..ఇక ఇంగ్లాండ్ టూర్ లో రెచ్చిపోయిన గిల్ అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్నాడు. జూలై నెల‌కు సంబంధించి ప్లేయ‌ర్ ఆఫ్ ద క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్ లో త‌ను ఈనెల‌లో మూడు టెస్టులాడి 5వంద‌ల‌కు పైగా ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక డ‌బుల్ సెంచ‌రీ, రెండు సెంచ‌రీలు ఉన్నాయి. ముఖ్యంగా గిల్ దూకుడుతో ఎప్పుడూ భార‌త్ గెల‌వ‌ని బ‌ర్మింగ్ హామ్ వేదిక‌పై ఇండియా విజయాన్ని సాధించింది. ఈ అవార్డు కోసం ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, సౌతాఫ్రికా క్రికెట‌ర్ వియాన్ మ‌ల్ద‌ర్ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నాడు. అయిన‌ప్ప‌టికీ చివ‌రికి గిల్ నే ఈ అవార్డు వ‌రించింది. ఈ అవార్డు ద‌క్క‌డం త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు గిల్ పేర్కొన్నాడు.