Sachin Tendulkar son Arjun Tendulkar Latest News: భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఓ ఇంటివాడు కాబోతున్నాడా..? ఇన్ ఫాక్ట్ ఆ దిశగా తొలి అడుగు వేసేశాడా..? మీడియాలో ఇందుకు సంబంధించిన ఒక అంశం హల్చల్ చేస్తోంది. తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అర్జున్ నిశ్చితార్థం జరిగిందని కథనాలు వెలువడ్డాయి. వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన సానియా చందోక్ అనే యువతితో అర్జున్ ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. సానియాతో అర్జున్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పలువురు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి అటు టెండూల్కర్ ఫ్యామిలీ కానీ, ఇటు చందోక్ ఫ్యామిలీ గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఎవరీ సానియా..ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలే ఈ సానియా.. వీళ్లకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీలో సంస్థలు ఉన్నాయి. ప్రముఖ కాంటినేంటల్ హోటల్, బ్రూక్లీన్ క్రీమరీ సంస్థలను ఈ కుటుంబమే నిర్వహిస్తోంది. ఇక అర్జున్ తోపాటు అతని సోదరి సారాతో సానియా కలిసి ఉన్న ఫోటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ, కంగ్రాట్స్ చెబుతున్నారు. ఏదేమైనా త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
పడుతూ లేస్తూ..ది గ్రేట్ సచిన్ కొడుకైనప్పటికీ, అర్జున్ కెరీర్ అంతంతమాత్రంగానే నడుస్తోంది. 26వ పడిలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అంతర్జాతీయంగా అరంగేట్రం చేయలేదు. నిజానికి ఐపీఎల్లోనే తను ఏమీ నిరూపించుకోలేదు. మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. బేసిగ్గా లెఫ్టార్మ్ పేసర్ అయినప్పటికీ, బ్యాటింగ్ కూడా చేయగలడు. 2023లో ముంబై తరపున అరంగేట్రం చేసిన అర్జున్.. ఆ సీజన్ లో నాలుగు మ్యాచ్ లే ఆడి నిరాశపర్చాడు. ఆ తర్వాత సీజన్ కు తనను ముంబై రిటైన్ చేసుకోగా, కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఆడి వికెట్ లెస్ గా నిలిచాడు. ఇక 2025లో తనను తిరిగి ముంబై జట్టే రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ముంబై టీమ్ మెంటార్ గా సచిన్ ఉండటంతోనే అర్జున్ ను ఆ జట్టు కొనుగోలు చేసిందనే చర్చ కూడా ప్రచారంలో ఉంది. ఇక డొమెస్టిక్ క్రికెట్ లో గోవాకు ఆడే అర్జున్.. 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 37 వికెట్లు తీశాడు. 532 పరుగులు కూడా సాధించాడు. అలాగే 24 టీ20లు ఆడి 27 వికెట్లతో పాటు 119 పరుగులు కూడా చేశాడు. అలాగే 18 లిస్ట్ ఏ (వన్డే)లు ఆడి, 25 వికెట్లు తీశాడు. 102 పరుగులు చేశాడు. తన ఆటను చూస్తే, సమీప భవిష్యత్తులో టీమిండియాకు ఆడే అవకాశం లేదని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.