Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ 101 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై గిల్ చేసిన ఈ సెంచరీలో 2 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గిల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది. గిల్ చేసిన ఈ సెంచరీలో కేఎల్ రాహుల్ పాత్ర చాలా ఎక్కువ ఉందని సోషల్ మీడియాలో అభిమానులు కితాబు ఇస్తున్నారు.
గిల్ తన సెంచరీ పూర్తి చేయడానికి తన అర్ధ సెంచరీని రాహుల్ త్యాగం చేశాడు. ఒక వేళ రాహుల్ ఔటై ఉంటే హార్దిక్ పాండ్యా వచ్చే వాడని అతను పెద్ద షాట్లు ఆడేవాడని ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ వచ్చి ఉంటే మాత్రం గిల్ సెంచరీ గురించి మర్చిపోవాల్సిందనంటూ సెటైర్లు వేస్తున్నారు.
229 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ, గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ఈ జోడీ జోరు మీద ఉన్న టైంలో రోహిత్ వికెట్ పడింది. ఆ తర్వాత మ్యాచ్ కాస్త నెమ్మదించింది. ఇలా 144 పరుగుల వద్ద నాల్గు వికెట్లను కోల్పోయింది టీమిండియా. ఒకవైపు వికెట్లు పడుతుంటే గిల్ మాత్రం ఏకాగ్రతతో ఆడుతూ వచ్చాడు. తర్వాత అతనికి కెఎల్ రాహుల్ మంచి మద్దతు ఇచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి జట్టును విజయపథంలోకి తీసుకెళ్లారు. రాహుల్ 47 బంతుల్లో 41 పరుగులు చేశాడు.
హాఫ్ సెంచరీ గురించి పట్టించుకోని కెఎల్ రాహుల్
కెఎల్ రాహుల్ తన అర్ధ సెంచరీ గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. శుభ్‌మాన్ గిల్ సెంచరీ పూర్తి చేసేలా సహకారం అందించాడు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులు రాసుకొస్తున్నారు. రాహుల్ ఔట్ అయ్యి, హార్దిక్ పాండ్యా మైదానంలోకి వచ్చి ఉంటే దూకుడుగా ఆడేవాడని గుర్తు చేస్తున్నారు. ఈ దూకుడుతో గిల్ సెంచరీ కోల్పోవాల్సి వచ్చేదని అంటున్నారు.
"2023 ప్రపంచ కప్‌లో కూడా విరాట్ కోహ్లీ సెంచరీకి రాహుల్ సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అభిమానులు. అప్పుడు కూడా తన అర్ధ సెంచరీ గురించి కెఎల్ రాహుల్ పట్టించుకోలేదు ఇప్పుడు కూడా అదే చేశాడని అంటున్నారు.