Shree  Charani Creates History in T20 Women's World Cup: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో రైజింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి సరికొత్త సంచలనం సృష్టించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆమె బౌలింగ్ మ్యాజిక్ చేసింది. 21 ఏళ్ల ఈ యంగ్ బౌలర్ ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ రికార్డు పుస్తకాలను తిరగరాసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో షోర్నా అక్తర్‌ను పెవిలియన్ చేర్చిన చరణి, తన ఖాతాలో 11వ వికెట్‌ను వేసుకుంది. ఈ వికెట్‌తో 2020 వరల్డ్ కప్‌లో పూనమ్ యాదవ్ నెలకొల్పిన 10 వికెట్ల రికార్డును చరణి బద్దలు కొట్టింది. ఆ ఓవర్లోనే మరో వికెట్ తీసి మొత్తం 12 వికెట్లతో ఇండియా తరఫున ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచింది. మరోవైపు ఈ మ్యాచ్ లో బంగ్లాపై ఐదు వికెట్లతో ఇండియా ఘన విజయం సాధించింది. 

Continues below advertisement

Continues below advertisement

 

నంబర్ వన్ బౌలర్ గా చరణి.. ఈ వరల్డ్ కప్ చరణి కెరీర్‌లో ఒక మెమరబుల్ జర్నీగా మిగిలిపోతుంది. ఈ టోర్నీకి ముందు జరిగిన మ్యాచుల్లో అద్భుత ప్రదర్శనతో ఆమె ఐసీసీ ఉమెన్స్ టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు, సౌతాఫ్రికాతో త్రీ-వికెట్ హాల్‌తో ఆమె ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కూడా తన మార్క్ చూపించింది. బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా, ఓపెనర్ జువైరియా ఫిరదౌస్ ఆ జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించినా, డెత్ ఓవర్లలో చరణి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రన్ రేట్‌ను కంట్రోల్ చేసింది. కీలక సమయంలో రెండు వికెట్లు తీసి ఆమె ఇండియాను గెలుపు బాటలో నిలిపింది. 

Read Also: Rishabh Pant Shares Farewell Message: 12 కోట్ల నష్టానికి పాత గూటికి చేరిన పంత్.. లక్నోకు కేవలం 3 ముక్కల వీడ్కోలు సందేశం

ఆల్ టైమ్ రికార్డుపై కన్నేసిన యంగ్ స్టార్కేవలం నాలుగు మ్యాచుల్లోనే 12 వికెట్లు తీసి శ్రీ చరణి తన పవర్ చూపించింది. గతంలో పూనమ్ యాదవ్ 10 వికెట్లు, డయానా డేవిడ్ 9 వికెట్లు తీయగా, వారందరినీ చరణి దాటేసింది. ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చరణి ఇప్పుడు జాయింట్ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్ ప్లేయర్ అమెలియా కెర్ పేరిట ఉన్న 15 వికెట్ల ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం చరణి ముందు ఉంది. ఇండియా ఇంకా మ్యాచులు ఆడాల్సి ఉండటంతో, ఆమె ఈ రికార్డును కూడా దాటేసి కొత్త హిస్టరీ రాసే అవకాశం ఉందని తెలుస్తోంది.