IPL Cricketer Shashank Singh Face Legal Trouble: పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్, అతని తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శైలేష్ సింగ్ లతో పాటు వారి డ్రైవర్ ఒక పెద్ద లీగల్ టెన్షన్ లో పడ్డారు. తమ ఇంట్లో కొత్తగా జాయిన్ అయిన వంటమనిషి పై దాడి చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం, బంధించి బెదిరించడం లాంటి తీవ్రమైన ఆరోపణల వల్ల వీరిపై భోపాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ పోలీస్ మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ అయిన శైలేష్ సింగ్ భోపాల్ రెసిడెన్స్ లో ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. రేవా జిల్లాకు చెందిన 31 ఏళ్ల విపేంద్ర సింగ్ తోమర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రతీబాద్ పోలీస్ స్టేషన్ లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 296(a), 115(2), 3(5) కింద ఎఫ్‌ఐఆర్ (FIR) రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేశారు.
బంధించి కొట్టారు.. తోమర్ ఎమోషనల్ వీడియో వైరల్
బాధితుడు తోమర్ తన ఎఫ్‌ఐఆర్ లో సంచలన విషయాలు పేర్కొన్నాడు. జూన్ 25న నెహ్రూనగర్-మేండోరి రోడ్‌లోని సింగ్ ఫ్యామిలీ ఇంట్లో నెలకు 15,000 రూపాయల శాలరీతో పాటు ఫుడ్, రూమ్ ఇచ్చేలా ప్రైవేట్ కుక్ గా జాయిన్ అయినట్లు చెప్పాడు. అయితే ఫస్ట్ డే నుంచే వంట బాలేదంటూ తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని ఆరోపించాడు. జూన్ 28న బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేశాక తన ఫోన్ అడగ్గా శైలేష్ సింగ్ ఇవ్వకుండా నిరాకరించాడని, ఆ తర్వాత శశాంక్ సింగ్, అతని తండ్రి, డ్రైవర్ మిశ్రా కలిసి తన రూమ్‌లోకి వచ్చి ఫిజికల్ గా అటాక్ చేశారని తోమర్ కంప్లైంట్ ఇచ్చాడు. తనను ఇల్లు వదిలి వెళ్లగొడుతూ ఫోన్ నుంచి 1,000 రూపాయల ఫుడ్ ఎక్స్ పెన్సెస్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని, ఎదురు తిరిగితే దొంగతనం, రేప్ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారని కన్నీరు పెట్టుకున్నాడు. తోమర్ తన ఫేస్, బాడీపై ఉన్న గాయాలను చూపిస్తూ రిలీజ్ చేసిన ఎమోషనల్ వీడియో ప్రెజెంట్ సోషల్ media లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మే నెలలోనే మరో కంప్లైంట్.. మాజీ ఐపీఎస్ పై వరస ఆరోపణలు
రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శైలేష్ సింగ్ పై ఇలాంటి కంప్లైంట్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. కేవలం రెండు నెలల క్రితమే మే 5, 2026 న విదిశ జిల్లాకు చెందిన రాజీవ్ విశ్వకర్మ అనే వ్యక్తి కూడా మధ్యప్రదేశ్ డీజీపీ కైలాష్ మక్వానాకు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. శైలేష్ సింగ్ ఇంట్లో పని చేస్తున్నప్పుడు తనను కూడా ఇలాగే ఇల్లీగల్ గా బంధించి, కొట్టి, మొబైల్ ఫోన్, బ్యాగ్ లాక్కున్నారని విశ్వకర్మ ఆరోపించాడు. ఇలా వరసగా కంప్లైంట్స్ రావడం భోపాల్ పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
శశాంక్ సింగ్ సంచలన కౌంటర్
ఈ ఆరోపణలన్నింటినీ పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కంప్లీట్‌గా డినై చేశాడు. ఇవన్నీ వంద శాతం అబద్ధపు కేసులని శశాంక్ సింగ్ స్పష్టం చేశాడు. తోమర్ ఒక డ్రగ్ అడిక్ట్ అని, ఇంట్లోని లగ్జరీ ఐటమ్స్, తన వార్డ్‌రోబ్‌లోని కాస్ట్లీ వాచెస్ ఫోటోలు, వీడియోలు తీస్తూ దొంగతనానికి ప్లాన్ చేస్తుండగా తన మదర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని చెప్పాడు. జూన్ 26న తన పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో తామంతా హోటల్ లో ఉన్నామని, తోమర్ వంట బాలేనందున కేవలం ఇల్లు వదిలి వెళ్లమని మాత్రమే చెప్పామని అన్నాడు. తాము ఎలాంటి దాడి చేయలేదని, అతను క్లియర్ గా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఫుటేజ్ తమ దగ్గర ఉందని, బయటకు వెళ్లాక ఎవరితోనైనా గొడవ పడ్డాడేమో మాకు తెలియదని శశాంక్ సింగ్ స్పష్టం చేశాడు.
