స్వదేశం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా ఓపెనర్‌.. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో అర్థ శతకంతో సత్తా చాటాడు. 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి శుభ్‌మన్ గిల్  అవుటయ్యాడు.  మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి మహ్మదుల్లా పట్టిన సూపర్ క్యాచ్‌కు అవుటయ్యాడు. అయితే శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ప్రత్యేక అతిథి చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహించింది. ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడల్లా కేరింతలు కొడుతూ ఎంకరేజ్ చేసింది. గిల్‌ను అంతలా ప్రోత్సహించిన ఆ ప్రత్యేక అతిథి ఎవరంటే క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ గారాలపట్టి సారా టెండూల్కర్‌. శుభ్‌మన్ గిల్ ఫోర్లు , సిక్సులు కొట్టినప్పుడు స్టేడియంలోని సారా టెండూల్కర్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. గిల్ బౌండరీ కొట్టినప్పుడల్లా చప్పట్లు చరుస్తూ సారా ఎంకరేజ్ చేసింది. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో హసన్ మహమూద్ బౌలింగ్‌లో గిల్ ఎడ్జ్ తీసుకున్న బాల్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్లింది. ఈ ఫోర్ తర్వాత సారా టెండూల్కర్ ఫుల్ ఎగ్జైంట్‌గా పీలై గట్టిగా చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాను దున్నేస్తోంది.


 భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ హాజరైంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి వచ్చింది. స్టాండ్స్‌ నుంచి సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ టీమిండియాకు మద్దతు తెలిపింది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ రెండు సిక్స్‌లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతన్ని అభినందించింది. గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయింది.


సోషల్ మీడియాలో గిల్, సారా టెండూల్కర్ ఒకరినొకరు ఫాలో కావటం, పోస్టులకు కామెంట్స్ కూడా పెడుతూ రావటంతో అప్పట్లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా సైతం హాజరవుతూ రావటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. మరోసారి సారా మ్యాచ్‌కు హాజరుకావడంతో సోషల్ మీడియా వేదికగా మరోసారి శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ వార్తల్లో నిలిచారు. ఈ రూమర్లకు సారా టెండూల్కర్ ప్రవర్తన బలం చేకూర్చుంది. ఫీల్డింగ్ సమయంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టగా.. సారా టెండూల్కర్ ఎగిరి గంతేసింది. దాంతో ఈ ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ మొదలైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌కు వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. గతేడాది క్రితం వరకు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొత్త ప్రచారం తెరిపైకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దాంతో సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ లవ్‌కు సంబంధించిన గాసిప్స్‌కు బ్రేక్ పడింది.


తాజాగా సారా టెండూల్కర్.. టీమిండియా మ్యాచ్‌కు హాజరవ్వడంతో మరోసారి ఈ ఇద్దరి ప్రేమయాణం వార్తల్లో నిలిచింది. గిల్‌ బౌండరీ కొట్టిన ప్రతీసారి కెమెరామెన్‌ సారాను చూపించడంతో స్టాండ్లలో ఉన్న ఫ్యాన్స్‌ ఈలలు, కేరింతలతో ఊగిపోయారు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన గిల్ బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ టీమిండియాకు శుభారంభం అందించాడు. తొలి వికెట్‌కు రోహిత్‌తో కలిసి 88 పరుగులు జోడించి టీమిండియా విక్టరీకి గట్టిపునాది వేశాడు. రోహిత్ అవుటైన తర్వాత కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించిన గిల్.. అర్ధసెంచరీ పూర్తికాగానే పెవిలియన్ చేరాడు.