Wicketkeeper Batter Shuts Down Social Media Noise:  అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 పోరులో 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా, ఆడుతూ పాడుతూ టార్గెట్ చేజ్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 88 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు సాధించి సంజూ ఫామ్‌లోకి రావడంతో భారత్ 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీతో పోటీ గురించి వస్తున్న ఊహాగానాలకు సంజూ తనదైన శైలిలో స్పందించాడు. ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ ఎప్పటికీ శాశ్వతం అని మరోసారి నిరూపించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఓపెనింగ్ స్థానం కోసం నెలకొన్న తీవ్ర పోటీపై అడిగిన ప్రశ్నకు సంజూ దీటుగా ఆన్స‌రిచ్చాడు.

Continues below advertisement

Read Also: Brendan Taylor Breaks Sachin's Record: సచిన్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు బ్రేక్.. వన్డేల్లో చరిత్ర సృష్టించిన  టేలర్ 

జట్టు సభ్యుల మధ్య పోటీ లేదు..ఓపెనింగ్ బెర్త్‌ల వివాదంపై  సంజూ శాంసన్ స్పందిస్తూ, "బయటి ప్రపంచానికి మాత్రమే వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ నాకు పోటీదారులుగా కనిపిస్తారు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో మేమంతా ఒకే జట్టుగా దేశం కోసం ఆడుతున్నాం. మాకు జట్టు విజయం మాత్రమే ముఖ్యం, ఆ తర్వాతే వ్యక్తిగత ప్రదర్శనలు వస్తాయి. అతడికి అవకాశం ఇచ్చారు, నాకు ఎందుకు రాలేదు అని బాధపడుతూ నెగెటివ్ ఆలోచనలతో కూర్చోవడం మా జట్టు సంస్కృతిలో లేదు. అలాంటి మనస్తత్వాలు ఇక్కడ పనికిరావు" అని పేర్కొన్నాడు.

Continues below advertisement

Read Also: Samson Explosive Fifty: అఫ్గాన్‌ను చిత్తు చేసి సిరీస్ కొల్లగొట్టిన భారత్, శ్రేయ‌స్ ఖాతాలో స్వదేశంలో తొలి ట్రోఫీ .. స‌త్తా చాటిన నితీశ్, అభిషేక్, ఇషాన్.. 

ఆ కామెంట్లు నిరాశ క‌లిగిస్తాయి.. సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లు చేసే వ్యాఖ్యల గురించి సంజూ శాంసన్ మాట్లాడుతూ, "సాధారణంగా నేను వైఫై ఆఫ్ చేసి నెగెటివిటీకి దూరంగా ఉంటాను. కానీ కొన్నిసార్లు ఆ కామెంట్లు నా కంట పడుతుంటాయి. ఇండియాలో ఆడుతున్నప్పుడు ఇలాంటి కామెంట్లు ఆటగాళ్లపై ప్రభావం చూపుతాయి. మేం రోబోలం కాదు, మాకు భావోద్వేగాలు ఉంటాయి. గతంలో విమర్శలు నన్ను కూడా బాధించాయి. అయితే అనుభవంతో వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను. ఒక షాట్ ఆడే ముందు బయట ఏమనుకుంటారో అని ఆలోచిస్తే నేను ఇలా బ్యాటింగ్ చేయలేను" అని తెలిపాడు.

మూడో టీ20లో సూర్యవంశీ ఆడ‌తాడా..? మొదటి రెండు మ్యాచ్‌ల్లో సంజూ, అభిషేక్‌లు రాణించినప్పటికీ, బెంచ్‌పై ఉన్న వైభవ్ సూర్యవంశీకి మూడో టీ20లో అవకాశం ఇస్తామంటూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూచ‌న ప్రాయంగా చెప్పాడు. దీంతో ఆఖరి పోరులో ఎవరికి విశ్రాంతి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ ఈ సిరీస్ ను ఇప్ప‌టికే 2-0తో ఇండియా కైవ‌సం చేసుకోగా, స్వ‌దేశంలో శ్రేయ‌స్ కిదే తొలి సిరీస్ విక్ట‌రీ కావ‌డం విశేషం.