Sanju Samson Omission From Zimbabwe Tour Explained:  బీసీసీఐ (BCCI) సోమవారం ఈవినింగ్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ క్రికెట్ సర్కిల్స్ లో సాల్వ్ చేసిన దానికంటే ఎక్కువ సస్పెన్స్ క్రియేట్ చేసింది. టీ20 వరల్డ్ కప్ 2026 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజూ శాంసన్ పేరు ఈ మంత్ ఎండింగ్ లో జరగబోయే జింబాబ్వే సిరీస్ స్క్వాడ్ లో లేకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. రెండు రోజుల ముందే ఇంగ్లాండ్ తో జరిగిన మాంచెస్టర్ టీ20 మ్యాచ్ లో ఐపీఎల్ టాప్ స్కోరర్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ కోసం సంజూ తన ప్లేస్ ను త్యాగం చేశాడు. ఈ నయా డెసిషన్ తో టీ20 ప్లాన్స్ లో బీసీసీఐ ఏమైనా మార్పులు చేస్తోందా అనే డిబేట్ స్టార్ట్ అయింది. అయితే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, సంజూను పక్కన పెట్టడం వెనుక ఒక బ్రాడర్ ప్లాన్ (భారీ వ్యూహం) ఉందని తెలిసింది. యంగ్ ప్లేయర్లను టెస్ట్ చేయడానికి ఇదొక మంచి ఛాన్స్ అని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది.

Continues below advertisement

Read Also: Shapoor Zadran Passes Away News: భారత్‌లో చికిత్స తీసుకుంటూ కన్నుమూసిన ఆఫ్ఘన్‌ మాజీ బౌలర్ షాపూర్ జద్రాన్! విచారం వ్యక్తం చేసిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు! 

సంజూ శాంసన్ లాంగ్ టర్మ్ ప్లాన్.. సెలెక్టర్ల లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో సంజూ శాంసన్ ఇప్పటికీ ఒక మెయిన్ పిల్లర్ అని, ప్రెజెంట్ జింబాబ్వే సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వడం కేవలం ఒక టెంపరరీ అరేంజ్‌మెంట్ మాత్రమేనని మేనేజ్‌మెంట్ లీక్ ఇచ్చింది. సెప్టెంబర్ లో జరగబోయే ఏషియన్ గేమ్స్ స్క్వాడ్ లోనూ సంజూ ఉన్నాడు. ఇదే టైమ్‌లో క్రికెట్ వర్గాల్లో ఒక క్రేజీ 'త్యాగం థియరీ' కూడా విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. మాంచెస్టర్ టీ20 మ్యాచ్ లో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ ఎలెవన్ లోకి రావడానికి సంజూ శాంసన్ 'వాలంటరీగా' తనే తప్పుకుని బెంచ్ పై కూర్చున్నాడనే టాక్ నడుస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్ ఆడుతున్న టాప్ ఆర్డర్ బ్యాటర్లలో కేవలం సంజూను మాత్రమే జింబాబ్వే సిరీస్ కు డ్రాప్ చేయగా, బౌలింగ్ లో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ లకు కంప్లీట్ గా రెస్ట్ ఇచ్చారు.

Continues below advertisement

Read Also: Captain Cool MS Dhoni Birthday: లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!

వైభవ్ సూర్యవంశీ అసలైన టెస్ట్ ఇప్పుడే.. మరో ఎండ్ లో టీమిండియా నయా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక బిగ్ అలర్ట్ ఇచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో వైభవ్‌కు అదిరిపోయే స్టార్టింగ్ దొరికినప్పటికీ, అతని అసలైన టెస్ట్ ఇప్పుడే షురూ అయిందని పఠాన్  చెప్పాడు. ఇకపై ప్రత్యర్థి టీమ్ బౌలర్లు వైభవ్ బలహీనతలపై పక్కా టాక్టికల్ ప్లాన్స్ తో వస్తారని, వాటిని ఎదుర్కోవడానికి ఈ 15 ఏళ్ల కుర్రాడు మానసికంగా రెడీగా ఉండాలని సూచించాడు. వైభవ్ తన సహజ సిద్ధమైన ఫియర్ లెస్ అటాకింగ్ గేమ్ ను అస్సలు వదులుకోకూడదని, కానీ పరిస్థితులకు తగ్గట్లు అడాప్ట్ చేసుకోవడం చాలా క్రూషియల్ అని పఠాన్ హింట్ ఇచ్చాడు.

బ్యాలెన్స్ మిస్ కావద్దు..ఇంగ్లాండ్‌తో జరిగిన సెండ్ టీ20 మ్యాచ్ లో వైభవ్ కేవలం 10 బంతుల్లోనే 14 రన్స్ చేసి స్పిన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ వికెట్ పై పఠాన్ స్పందిస్తూ.. వైభవ్ చూపించిన ఇంటెంట్ తనకు బాగా నచ్చిందని అన్నాడు. "ఇంగ్లాండ్ పిచ్ లపై స్పిన్నర్ల బౌలింగ్ లో ముందుకు వచ్చి షాట్లు ఆడటం మంచి ఆప్షనే, ఎందుకంటే అక్కడ బాల్ పెద్దగా టర్న్ అవ్వదు. కానీ అలా ఆడేటప్పుడు బాడీ బ్యాలెన్స్ చాలా ముఖ్యం, బాల్ కు మరీ దూరంగా జరిగి షాట్లు ఆడకూడదు" అని పఠాన్ టెక్నికల్ గైడెన్స్ ఇచ్చాడు. థర్డ్ టీ20 లోనూ వైభవ్ తన అగ్రెసివ్ గేమ్ తో ఇంగ్లాండ్ పేస్ అటాక్ ను దెబ్బకొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడని స‌మాచారం.