Indian Cricketers Christmas: టీమిండియా క్రికెటర్ల క్రిస్మస్ సెలబ్రేషన్స్, కూతురు కోసం శాంతాక్లాజ్‌గా మారిన రోహిత్ శర్మ

నేడు క్రిస్మస్ పర్వదినం. ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకుంటున్నారు. . టీమిండియా క్రికెటర్లు కూడా ఈ పండుగను వారి వారి తీరుల్లో చేసుకుంటూ ఆ అందమైన క్షణాలను ఫొటోలు, వీడియోల్లో బంధిస్తున్నారు.

Continues below advertisement

Indian Cricketers Christmas: నేడు క్రిస్మస్ పర్వదినం. ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. టీమిండియా క్రికెటర్లు కూడా ఈ పండుగను వారి వారి తీరుల్లో చేసుకుంటూ ఆ అందమైన క్షణాలను ఫొటోలు, వీడియోల్లో బంధిస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఏయే క్రికెటర్లు క్రిస్మస్ ను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూద్దామా...

Continues below advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి క్రిస్మస్ పండుగను జరుపుకున్నాడు. వారందరూ మ్యాచింగ్ దుస్తులను ధరించి వేడుకలు చేసుకున్నారు. ఇంటిని అందంగా అలంకరించారు. పండుగకు సంబంధించిన ఫొటోలను సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీటికి అభిమానుల నుంచి కామెంట్లు అందుతున్నాయి. 

ఇక ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ముద్దుల తనయ సమైరా కోసం శాంతాక్లాజ్ అవతారమెత్తాడు. తన కుమార్తెను క్రిస్మస్ కానుకలతో ముంచెత్తాడు. టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన అభిమానులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. తన భార్య ప్రియాంకతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. 

Continues below advertisement