India vs South Africa 2nd Test: కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్  తొలిరోజు.. భారత్ చివరి ఆరు వికెట్లను...ఒక్క పరుగు కూడా చేయకుండా కోల్పోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.... 153 పరుగుల వద్ద అయిదో వికెట్ కోల్పోయిన భారత్... అదే స్కోర్ వద్ద అల్ అవుట్ అయింది. 11 బంతుల్లో ఆరు వికెట్స్ కోల్పోయింది. వికెట్ ఒక డాట్ బాల్... వికెట్ ఒక డాట్ బాల్... మళ్ళీ వికెట్ ఒక డాట్ బాల్.. ఇలా సాగింది టీం ఇండియా పతనం. W0WOWOOWOWW... ఇది చివరి 11 బంతుల్లో టీం ఇండియా వికెట్ల పతనం... ఇది చదివి నెటిజన్లు జస్ట్ లైక్ వావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. W0WOWOOWOWWను... జస్ట్ లైక్ ఏ వావ్ వావ్ వావ్ అని ఏకీ పారేస్తున్నారు.


దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించే అవకాశాన్ని భారత్‌(Bharat) చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 111 పరుగులకు 4 వికెట్లతో పటిష్టంగా కనిపించిన టీమిండియా 153 పరుగులకే కుప్పకూలింది.  టీమ్‌ఇండియా(Team India) చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్‌ బుమ్రా (0) లను పెవిలియన్‌కు పంపాడు. 153 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌... అదే స్కోరు వద్ద ఆలౌట్‌ అయింది.


ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్‌ బుమ్రా (0) లను పెవిలియన్‌కు పంపాడు. చివరి అయిదు వికెట్లు ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్‌ కావడం భారత బ్యాటింగ్‌ లోపాన్ని బయటపెట్టింది.  లుంగి ఎంగిడి,  రబాడ, బర్గర్‌ చెరో మూడు వికెట్లు తీయగా... సిరాజ్‌ రనౌట్‌ అవుట్ అయ్యాడు.  భారత బ్యాటర్లలో కోహ్లీ 46, రోహిత్‌ శర్మ 39, శుభ్‌మన్‌ గిల్ 36 పరుగులతో పర్వాలేదనిపించారు. ఆరుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 98 పరుగుల ఆధిక్యం సాధించింది.  


కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj).. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ మాక్రమ్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చిన మాక్రమ్ ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన సిరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 


కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు. ఒకే ఓవర్లో బెడింగ్‌హామ్‌ (12), మార్కో జాన్‌సెన్ (0)ని ఔట్ చేసి సిరాజ్‌ ఐదు వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్లో వెరినే (15).. స్లిప్‌లో శుభ్‌మన్‌కు చిక్కాడు. దక్షిణాఫ్రికా 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ను బుమ్రా.. కేశవ్‌ మహరాజ్‌ను ముఖేష్‌కుమార్‌ అవుట్‌ చేశారు. దీంతో 50 పరుగులకే సఫారీలు ఎనిమిది వికెట్లు కోల్పోయారు. అనంతరం బుమ్రా, ముఖేష్‌ చెరో వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ల ధాటికి ప్రొటీస్‌ 55 పరుగులకే కుప్పకూలడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది.