Rohit In Ranji Trophy: పని చేసిన గంభీర్ హెచ్చరికలు - రంజీల్లో బరిలోకి రోహిత్!

Gautham Ghambir: జట్టులో చోటు కోసం సీనియర్లతో పాటు ఇటీవల విఫలమైన క్రికెటర్లు దేశవాళీ బాటపట్టారు. బీసీసీఐ తప్పనిసరి నియమం లేకున్నప్పటికీ భవిష్యత్తు రిత్యా క్రికెటర్లు రంజీల్లో పాల్గొంటున్నారు. 

Continues below advertisement

Rohit Vs Gambhir: డొమెస్టిక్ క్రికెట్లో ఆడాలని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ చేసిన హెచ్చరికలు ప్లేయర్ల మీద ప్రభావం చూపించినట్లుగానే కనిపిస్తున్నాయి. ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే తర్వాది దశ ఎడిషన్ కోసం కొంతమంది భారత స్టార్లు ఆయా రాష్ట్ర రంజీ జట్ల తరపున ఆడేందుకు సిద్ధమవుతున్నారు. భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై జట్టుతో కలిసి ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో తను చెమటోడుస్తున్నట్లు సమాచారం. అయితే రాబోయే రంజీ సీజన్‌కు తను అందుబాటులో ఉంటాడో లేదోనని స్పష్టంగా ప్రకటన రాలేదు. జట్టులో చోటు కావాలంటే ప్లేయర్లందరూ కచ్చితంగా రంజీలు ఆడాలనే గంభీర్ చెప్పినట్లు కథనాలు వచ్చాయి. ఇప్పుడీ స్టార్ల వరుస చూస్తుంటే గంభీర్ హెచ్చరికలు నిజమేమో అనిపిస్తున్నాయి. 

Continues below advertisement

ఘోరంగా విఫలమైన రోహిత్..
ప్రత్యర్థి ఎవరైనా ధనాధన్ ఆటతీరుతో చెలరేగిపోయే భారత కెప్టెన్ రోహిత్ శర్మను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. అలాంటి రోహిత్.. ఇటీవల పరుగుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. బంగ్లాదేశ్ టూర్ నుంచి తను లయ కోల్పోయాడు. ఆసీస్ టూర్లో తన వైఫల్యాలు పతాక స్థాయికి చేరాయి. మూడు టెస్టులు ఆడి కేవలం 31 పరుగులు మాత్రమే చేసి, ఆసీస్ గడ్డపై అత్యంత తక్కువ పరుగులు చేసిన విదేశీ కెప్టెన్‌గా చెత్త రికార్డు మూట గట్టుకున్నాడు. దీంతో సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో తనంతట తానే జట్టు నుంచి తప్పుకునే పరిస్థితి తలెత్తింది. జట్టులో చోటు దక్కాలంటే తిరిగి తన లయను దొరకబుచ్చుకోవాలని రోహిత్ భావిస్తున్నాడు. అందుకే ముంబై రంజీ జట్టుతో చేరినట్లు తెలుస్తోంది. దీనిపై ఈ నెల 23 వరకు స్పష్టత వచ్చే అవకాశముంది. 

పంజాబ్ తరపున గిల్..
ఆసీస్ టూర్లో శుభమాన్ గిల్ కూడా విఫలమయ్యాడు. నిజానికి తనకు మంచి ఆరంభాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు టెస్టులు కలిపి కేవలం 91 పరుగులే చేశాడు. తను కూడా బ్యాట్‌తో రాణించాలని కోరుకుంటున్నాడు. అందుకే పంజాబ్ తరఫున రంజీల్లో బరిలోకి దిగనున్నాడు. మరో భారత స్టార్ విరాట్ కోహ్లీ.. రంజీల్లో ఆడటంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి దేశవ్యాప్తంగా టూర్ చేస్తున్నాడు. అతను ఢిల్లీ తరపున రంజీల్లో బరిలోకి దిగేదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే జట్టులో చోటు కావాలంటే రంజీల్లో ఆడాల్సిందేనని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దీంతో డొమెస్టిక్ క్రికెట్‌లో కోహ్లీ బరిలోకి దిగుతాడని పలువురు వాదిస్తున్నారు. చివరిసారిగా 2012లో కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడగా, రోహిత్ 2015లో బరిలోకి దిగాడు. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరూ సీనియర్లు దేశవాళీల్లో కనువిందు చేయబోతున్నారని అభిమానులు సంబర పడుతున్నారు. 

Also Read: Abhishek Sharma: కౌంటర్ల వెంట తిప్పిప్లైట్ మిస్సయ్యేలా చేశారు - చెత్త సర్వీస్ అంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై టీమిండియా టీ20 స్టార్ ఆగ్రహం

Continues below advertisement