Team India News: గ‌తేడాది కాలం నుంచి భార‌త మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తున్నాడు. వికెట్ల పంట పండిస్తూ దూసుకెళుతున్నాడు. ఇప్పటికే టీ20ల్లో త‌న సుస్థిరం చేసుకోగా, వ‌న్డేల్లోనూ ఎంట్రీ బ‌లంగా ఇచ్చాడు. తాజాగా న్యూజిలాండ్ తో జ‌రిగిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ఐదు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అయితే టీ20ల‌కు, వ‌న్డేల‌కు బౌలింగ్ లో వైవిధ్యం చూపిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా వ‌న్డేల్లో ఒకే ర‌క‌మైన వేరియేష‌న్ కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు పేర్కొన్నాడు. రెండు ఫార్మాట్లు వేర్వేర‌ని, అందుకే భిన్న ర‌కాలైన వేరియేష‌న్ల‌ను అమ్ముల పొదిలో ఉంచుకున్నాన‌ని పేర్కొన్నాడు. ఇక కివీస్ తో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిని తుదిజ‌ట్టులోకి తీసుకుంటార‌ని మాజీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అంచ‌నా వేశాడు. అత‌ని గెస్ ఫ‌లించి వ‌రుణ్ ఈ మ్యాచ్ లో ఆడాడు. అలాగే ఐదు వికెట్ల‌తో స‌త్తా చాటి, ఆడిన తొలి ఐసీసీ వ‌న్డే టోర్నీలోనే ఘ‌నంగా త‌న ఎంట్రీ చాటుకున్నాడు. గ‌తేడాది టీఎన్ పీఎల్ సంద‌ర్భంగా దిండిగుల్ జ‌ట్టుకు వీరిద్ద‌రూ క‌లిసి ఆడారు. అప్పటి నుంచే వ‌రుణ్ తో అశ్విన్ కు సాన్నిహిత్యం ఉంది. 

సీనియ‌ర్లు ఎంతో హెల్ప్ చేశారు..ఐసీసీ టోర్నీలో ఆడ‌టంతోనే వ‌రుణ్ ఎమోష‌నల్ అయ్యాడు. నిజానికి మూడేళ్ల కింద‌టే త‌ను తొలిసారిగా ఐసీసీ టోర్నీ ఆడాడు. దుబాయ్ లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో ఆడిన వ‌రుణ్ కు చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. ఆ టోర్నీలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో విమ‌ర్శ‌లు చెల‌రేగ‌డంతో త‌ను తెర‌మ‌రుగయ్యాడు. ఆ త‌ర్వాత జాతీయ జ‌ట్టులోకి రావడానికి మూడేళ్ల టైం ప‌ట్టింది. ఇక గ‌తేడాది సౌతాఫ్రికా టూర్ నుంచి షైన్ అవుతున్న వ‌రుణ్.. త‌న జోరుతో వ‌న్డేల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ టోర్నీలో భార‌త్ త‌రపున అత్యుత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న (5-42) త‌న‌దే కావ‌డం విశేషం. ఓవ‌రాల్ గా కివీస్ పేస‌ర్ మ్యాట్ హెన్రీ (5-42)తో క‌లిసి బెస్టింగ్ బౌలింగ్ లో త‌ను సంయుక్తంగా అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఇక కివీస్ తో మ్యాచ్ లో త‌ను తొలుత గ‌తం గుర్తుకొచ్చి, ఎమోష‌న‌ల్ అయితే, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ త‌దిత‌రులు త‌న ద‌గ్గ‌ర‌కొచ్చి ధైర్యం చెప్పార‌ని చెప్పుకొచ్చాడు. 

టీమ్ సెలెక్ష‌న్ లో త‌ల‌నొప్పులు..డార్క్ హార్స్ గా బ‌రిలోకి దిగిన వ‌రుణ్ స‌త్తా చాట‌డంతో ఆస్ట్రేలియాతో మంగ‌ళ‌వారం జ‌రిగే సెమీ ఫైన‌ల్ కు జ‌ట్టు సెలెక్ష‌న్ క్లిష్టంగా మారిపోయింది. కివీస్ తో మ్యాచ్ లో న‌లుగురితో ఆడిన ఫ‌లితం రాబ‌ట్టిన టీమిండియా, అదే వ్యూహంతో బ‌రిలోకి దిగాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. దీంతో హ‌ర్షిత్ రాణా మ‌రోసారి రిజ‌ర్వ్ కు ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఏదేమైనా అన్ని రంగాల్లో బ‌లంగా ఉన్న టీమిండియా.. రేప‌టి మ్యాచ్ లో ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగుతోంది. మ‌రో సెమీస్ లో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ .. లాహోర్లో త‌ల‌ప‌డ‌నుంది. 

Read Also: