Rohit Sharma-Ritika Sajdeh Love Story: టెస్ట్ క్రికెట్ నుండి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, తన స్నేహితులతో కలిసి రితికా సజ్దేకి ఎలా ప్రపోజ్ చేయాలో ప్లాన్ చేసినట్లు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతను పిచ్ పై మోకాళ్లపై కూర్చుని రితికాను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేశాడు. హర్భజన్ సింగ్, అతని భార్య గీతా బస్రా షోలో రోహిత్ మరోసారి ప్రపోజ్ చేశాడు.
చాలా రొమాంటిక్ గా నా ప్రపోజల్
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. రితికా సజ్దేకు నేను చేసిన ప్రపోజల్ చాలా రొమాంటిక్‌గా ఉంది. మొదట రితికాను నేను క్రికెట్ ఆడే చోటుకు తీసుకెళ్లాను. ఆమె నా కోసం ఫుడ్ తెచ్చింది. ఇద్దరం కలిసి తిన్నాం. క్రీం తినడానికి వెళ్దాం అని చెప్పాను. మేం కారులో మెరైన్ డ్రైవ్ నుండి బయలుదేరాం. దాదర్, బాంద్రా, వర్లీ ఏరియాలు దాటి వెళ్ళాము. అప్పుడు ఆమె నన్ను ఐస్ క్రీం ఎక్కడుందని అడిగింది? అప్పుడు నేను రితికాకు బోరివాలిలో మంచి ఐస్ క్రీం షాప్ ఉందని చెప్పాను. నేను ఆ ఏరియాలో నివసించేవాడిని. తరువాత మేం స్టేడియానికి చేరుకున్నాము." అని అన్నాడు.
మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాను
"నా స్నేహితులకు ముందే సెటప్ చేసి ఉంచాలని చెప్పాను. వారు నాకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్షణాన్ని రికార్డ్ చేయండి. నేను కారును స్టేడియం మధ్యలో పార్క్ చేశాను. పిచ్ పై మోకాళ్లపై కూర్చుని రితికాకు లవ్ ప్రపోజ్ చేశాను" అని రోహిత్ శర్మ తన లవ్ ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ ఇంకా మాట్లాడుతూ.. 2008లో మేం మొదటిసారి కలుసుకున్నాం. మా పరిచయం ఫ్రెండ్ షిప్‌గా మారింది. తరువాత ఆమె నా కోసం ఫుడ్ తెచ్చేది. ఎందుకంటే నాకు హోటల్ ఫుడ్ నచ్చేది కాదు. 2013లో మా మధ్య స్నేహాన్ని మించి ఏదో ఉందని ఇద్దరం భావించాం. మా స్నేహితులకు సైతం మా మధ్య ఉన్నది లవ్ అని అనుకున్నారు. కానీ మొదట్లో మాకు అలా అనిపించలేదని" చెప్పాడు. రితికా విషయంలో రోహిత్‌ను యువరాజ్ సింగ్ హెచ్చరించాడు. ఆమె నా సిస్టర్ బీ కేర్‌ఫుల్ అనే మొదట్లో అనేవాడని రోహిత్ సైతం గుర్తుచేసుకున్నాడు.
రోహిత్ శర్మ, రితికా సజ్దేహ్ డిసెంబర్ 13, 2015న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. డిసెంబర్ 30, 2018న వీరికి కుమార్తె జన్మించింది. ఆమెకు సమైరా అని పేరు పెట్టారు. నవంబర్ 15, 2024న కుమారుడు పుట్టగా, అతనికి అహాన్ అని పేరు పెట్టారు.
రోహిత్ శర్మ T20, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు నెగ్గింది. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన వెంటనే పొట్టి ఫార్మాట్‌కు హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల ఐపీఎల్ సమయంలో టెస్ట్ క్రికెట్‌కు సైతం వీడ్కోలు పలికాడు. దాంతో శుబ్‌మన్ గిల్ టెస్టు పగ్గాలు అందుకున్నాడు.