Rohit Sharma In Ranji: జూలు విదిల్చిన రోహిత్ - సిక్సర్లతో విరుచుకుపడ్డ హిట్ మ్యాన్, రంజీల్లో ఫామ్‌లోకి వచ్చినట్లేనా?

Rohit Sharma: భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వస్తున్నాడు. తాజా మ్యాచ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. ఇది చూసిన అభిమానులు పులకరించిపోయారు. కేరింతలు కొడుతూ మద్ధతు పలికారు.

Continues below advertisement

Rohit Sharma News: భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వస్తున్నాడు. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో ముంబైలో జరుగుతున్న రంజీ ట్రోఫీలో సిక్సర్లతో రోహిత్ రెచ్చిపోయాడు. తనను తొలి ఇన్నింగ్స్‌లో ఔట్ చేసిన ఉమర్ మిర్ బౌలింగ్‌లో తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ ఆడాడు. రోహిత్ కళ్లు చెదిరేలా సిక్సర్ బాదడంతో స్టేడియంలోని అభిమానులు పులకరించిపోయారు. కేరింతలు కొడుతూ రోహిత్‌కు మద్ధతు పలికారు. దీంతో మరింత జోష్‌లోకి వచ్చిన రోహిత్.. ప్రత్యర్థి బౌలర్లను కాసేపు ఆటాడుకున్నాడు. 35 బంతుల్లో 28 పరుగులు చేసిన రోహిత్.. రెండు బౌండరీలు, మూడు టవరింగ్ సిక్సర్లు నమోదు చేశాడు. అయితే ఆ జోరును చివరి కంటా కొనసాగించలేకపోయాడు. యుద్వీర్ సింగ్ బౌలింగ్‌లో ఆబిద్ ముస్తాఖ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఏదేమైనా తొలి ఇన్నింగ్స్‌లో మూడు పరుగులతో తుస్సుమనింపించిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అభిమానులను అలరించాడు. తాజాగా రోహిత్ సిక్సర్లు కొడుతున్న వీడియోను అభిమానులు వైరల్ చేశారు. షేర్లు, కామెంట్ల, లైకులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 

Continues below advertisement

బ్యాటింగ్ లో విఫలమైన ముంబై..
ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. లంచ్ విరామానికి 22 ఓవర్లలో 5 వికెట్లకు 86 పరుగులను ముంబై చేసింది. యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 26, 4 ఫోర్లు) శుభారంభాన్ని యూస్ చేసుకోలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ మరోసారి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే ఔటయ్యాడు. ఇక లెఫ్టార్మ్ బ్యాటర్ శివందూబే అయితే ఘోరంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ ఖాతా తెరవలేకపోయాడు. రంజీ ట్రోఫీ గ్రూప్ ఏ, ఎలైట్ డివిజన్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 120 పరుగులకే కుప్పకూలగా, జమ్మూకశ్మీర్ 206 పరుగులు చేసింది. దీంతో కీలకమైన 86 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లంచ్ విరామం వరకు ముంబై సరిగ్గా 86 పరుగులు చేయడంతో ప్రస్తుతం స్కోర్లు సమమయ్యాయి. వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి జమ్ముకశ్మీర్‌కు ఎక్కువ టార్గెట్ విధించాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు. 

ఛాంపియన్స్ ట్రోఫీ కీలకం..
ఇక ఇప్పటికే రిటైర్మెంట్ ఏజ్‌కి వచ్చేసిన రోహిత్‌కి ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించడం తప్పనిసరి అని తెలుస్తోంది. ఇక్కడా విఫలమైతే తను టీమిండియాలో చోటును మర్చిపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా రోహిత్ కెరీర్ ఎండింగ్‌కి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో కలిపి 5 ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్ మ్యాన్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ చివరగా ఆడిన  బాక్సింగ్ డే టెస్టులో ఏరి కోరి మరి తన ఓపెనింగ్ పొజిషిన్ లోకి వచ్చిన రోహిత్ కేవలం ఐదు బంతులకే ఔటయ్యాడు. జట్టులోతన బ్యాటింగ్ స్థానం గురించి యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌ను టీమ్ నుంచి తప్పించారు. నిజానికి ఫుల్ షాట్ ఆడటంతో దిట్ట అయిన రోహిత్.. అదే ఫుల్ షాట్ ఆడుతూ ఔట్ కావడం అతని ఫామ్ లేమిని సూచిస్తోందని దిగ్గజ క్రికెటర్లు మండి పడుతున్నారు. ఇక ఈ టెస్టులో కెప్టెన్సీ వైఫల్యాలపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ ఏడాదే రోహిత్ తోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

Also Read: Virender Sehwag: విడాకులకు రెడీ అయిన దిగ్గజ భారత ఓపెనర్! - కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సంకేతాలు!

Continues below advertisement